health tips: సగ్గుబియ్యంతో బీపీ కంట్రోల్.. ఇంకా బోలెడు హెల్త్ బెనిఫిట్స్!!
సగ్గుబియ్యంతో బీపీ కంట్రోల్ అవ్వటమే కాకుండా ఇంకా బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి.
సగ్గుబియ్యం.. మంచి పోషకాలు ఉన్న సగ్గుబియ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో సాబుదానా అని పిలుస్తుంటారు. ఏ పేరుతో పిలిచినా పుష్కలంగా పోషకాలు ఉండి మన ఆరోగ్యానికి మేలు చేసే గొప్ప గుణాలు సగ్గుబియ్యంలో ఉంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో చాలామంది చల్లదనం కోసం సగ్గుబియ్యంతో తయారుచేసిన జావను తాగుతారు.

సగ్గుబియ్యంలో ప్రోటీన్లు
ఎప్పుడు మన వంటగదిలో అందుబాటులో ఉండే వాటిలో ఒకటైన సగ్గుబియ్యంతో పాయసం, కిచిడి, జావ, వడియాలు వంటి ఆహార పదార్థాలను తయారు చేసుకోవడమే కాదు, సగ్గుబియ్యాన్ని ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సగ్గుబియ్యంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కండరాలకు చాలా శక్తినిస్తాయి. కణాల వృద్ధికి కూడా చక్కగా ఉపయోగపడతాయి. సగ్గుబియ్యంలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల అది మనలో రక్తపోటుని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

సగ్గుబియ్యంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
సగ్గుబియ్యం తింటే బరువు కూడా పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. శరీరంలో ఎముకలు గట్టిగా ఉండడానికి సగ్గుబియ్యం ఇంతగానో దోహదం చేస్తుంది. అందుకే ఎదిగే చిన్నారులకు సగ్గుబియ్యంతో చేసిన వంటకాలను చేసి పెట్టడం ఎంతో మంచిదని చెప్పబడింది. సగ్గుబియ్యం లో కాల్షియం, ఐరన్, విటమిన్ కే సమృద్ధిగా ఉండడంవల్ల అవి మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి.

సగ్గుబియ్యం తీసుకుంటే ఈ సమస్యలు దరి చేరవు
సగ్గుబియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే మన గుండెకు కవాటాల మీద ఒత్తిడి పడకుండా చూడటంలో సగ్గుబియ్యంలో ఉన్న పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. బాగా నీరసంగా ఉన్నవారు సగ్గుబియ్యాన్ని జావగా చేసుకుని తీసుకుంటే వారికి తక్షణ శక్తి వస్తుంది. జ్వరం, విరోచనాలు ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నవారు సగ్గుబియ్యాన్ని తీసుకుంటే ఎంతో మేలు అని చెబుతున్నారు న్యూట్రిషనిష్టులు. సగ్గుబియ్యం తీసుకుంటే అజీర్తి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

సగ్గుబియ్యంలో పోషకాలు ఇందుకే
నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా సగ్గుబియ్యం బాగా కీలకంగా వ్యవహరిస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. పోషకాహార లోపం ఉన్నవారు సగ్గుబియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే పోషకాహార లోపం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. సగ్గు బియ్యాన్ని కర్ర పెండలం పాల నుండి తయారు చేస్తారు. అందుకే దీనిలో చాలా పోషకాలు ఉంటాయని చెప్తారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications