health tips: డయాబెటిస్ తో చాలా డేంజర్... కచ్చితంగా ఈ రూల్స్ పాటించాల్సిందే!!

డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేస్తే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని కొన్ని ప్రాధమిక సూత్రాలు పాటిస్తే షుగర్ ను కంట్రోల్ లో ఉంచవచ్చని చెప్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇక డయాబెటిస్ బారిన పడినవారు ప్రతిరోజు మందులను వాడటమే కాకుండా ఆహారం విషయంలో, వ్యాయామం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే డయాబెటిస్ తో పాటు వచ్చే అదనపు సమస్యల బారిన పడాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

డయాబెటిస్ తో ఇన్ని సమస్యలు.. ఒత్తిడితో ఉంటే మరిన్ని దుష్ప్రభావాలు

డయాబెటిస్ తో ఇన్ని సమస్యలు.. ఒత్తిడితో ఉంటే మరిన్ని దుష్ప్రభావాలు

డయాబెటిస్ బారిన పడిన వారికి బిపి, కిడ్నీల సమస్య, గుండె జబ్బుల సమస్య, కాలేయం సమస్య, కంటి చూపు సమస్య, నరాల సమస్య, కండరాల సమస్య, చర్మ సమస్యలు, కీళ్ల నొప్పుల సమస్య ఇలా రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడూ డయాబెటిస్ బాధితులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పై దృష్టి సారించాలి. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు ఒత్తిడిని తగ్గించుకోవాలి. విపరీతంగా ఒత్తిడి పెరిగితే రక్తంలో చక్కెర నిల్వలు ఊహించని స్థాయిలో పెరిగిపోతాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడం డయాబెటిస్ బాధితులకు అవసరం.

డయాబెటిస్ కంట్రోల్ కావాలంటే ఇది తప్పని సరి

డయాబెటిస్ కంట్రోల్ కావాలంటే ఇది తప్పని సరి


డయాబెటిస్ బాధితులు ప్రతిరోజూ ఒక గంటపాటైన వ్యాయామం చేయాలి. తప్పనిసరిగా వ్యాయామం చేసినవారికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. వ్యాయామం చేయకపోతే షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ బాధితులు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. లేదా రోజు ఒక గంట పాటైనా వాకింగ్ చేయాలి. అంతేకాదు డయాబెటిస్ బాధితులు కచ్చితంగా ఆహార నియమాలను పాటించాలి. ఏది పడితే అది తినకూడదు. అలా అని మొత్తానికే తిండి తినకుండా కడుపును మార్చుకోకూడదు.

డయాబెటిస్ బాధితులు పోషకాలపై దృష్టి పెట్టాలి

డయాబెటిస్ బాధితులు పోషకాలపై దృష్టి పెట్టాలి

డయాబెటిస్ ను కంట్రోల్ చేసే ఆహార పదార్థాలను ఎంపిక చేసుకొని తినాలి. షుగర్ కంట్రోల్ లోకి రావాలి అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. సహజంగానే డయాబెటిస్ బాధితులకు శరీరంలో పోషకాల లోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పోషక లోప నివారణ కోసం కచ్చితంగా ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ ని కంట్రోల్ చేసే ఆహారాలను తీసుకోవడమే కాదు, టీలు, కాఫీలు, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ లు, స్వీట్లు ఇటువంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. షుగర్ కంట్రోల్ కావాలంటే సమయం ప్రకారం పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. రోజు ఎనిమిది గంటలపాటు కచ్చితంగా నిద్రపోవాలి. అనవసరమైన టెన్షన్లు తీసుకోకూడదు.

షుగర్ కంట్రోల్ లోకి రావాలంటే ఈ సూత్రాలు ఫాలో అవ్వాలి

షుగర్ కంట్రోల్ లోకి రావాలంటే ఈ సూత్రాలు ఫాలో అవ్వాలి


షుగర్ కంట్రోల్ లోకి రావాలి అంటే ప్రాథమికంగా ఈ సూత్రాలను పాటిస్తే కొంతవరకు షుగర్ కంట్రోల్ లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రాథమికంగా ఈ సూత్రాలను పాటించడంతోపాటుగా, వైద్యులు సూచించిన మందులను కూడా వాడుతూ డయాబెటిస్ ను కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదంటే పేషెంట్లుగా మారి బెడ్ కి పరిమితమయ్యే పరిస్థితి వచ్చినా రావచ్చని అంటున్నారు వైద్యులు. కాబట్టి డయాబెటిస్ బాధితులు... తస్మాత్ జాగ్రత్త!!


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+