health tips: అల్పాహారంగా వీటిని తీసుకోకండి.. మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది!!
చాలామంది ఉదయం అల్పాహారం తీసుకొనే విషయంలో జాగ్రత్తలు పాటించరు. ఏదో ఒకటి తింటే సరిపోతుంది అని భావిస్తూ ఉంటారు. ఉదయం తీసుకొనే అల్పాహారం మాత్రమే మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. అటువంటి అల్పాహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే తరువాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.అందుకే అల్పాహారం విషయంలో కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
అల్పాహారంగా ఏం తినాలి ఏం తినకూడదు అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఉదయం పూట అల్పాహారం లో కార్బోహైడ్రేట్ ఆధారిత ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఉదయం అల్పాహారంలో కార్బోహైడ్రేట్లను తీసుకోవడం వల్ల కార్టిసాల్, డోపమైన్ వంటి రసాయనాలు ఉత్పత్తి జరిగి శరీరంలో నీరసాన్ని కలిగిస్తాయి.

అంతేకాదు కార్బోహైడ్రేట్లను అల్పాహారంలో తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. దీనివల్ల పొట్ట మరియు నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఉదయం అల్పాహారంలో కార్బోహైడ్రేట్లను తీసుకోవడం వల్ల ఊబకాయ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే అల్పాహారం తీసుకునేటప్పుడు బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు ఏమి తినాలి? ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? వంటి విషయాలను కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి.

ఉదయం పూట కార్బోహైడ్రేట్లు తినడం వల్ల గ్రెలిన్ ప్రతిస్పందన పెరుగుతుంది. గ్రెలిన్ ఆకలికి సంబంధించిన హార్మోన్. ఇది మానవ శరీరంలో కడుపు నుండి విడుదలై మెదడుకు తినాలనే సంకేతాన్ని ఇస్తుంది. అయితే ఉదయం కార్బోహైడ్రేట్లు తినడం వల్ల ఈ ప్రతిస్పందన ఎక్కువగా ఉండి పదేపదే ఆకలి వేస్తుంది. దీంతో ఏదో ఒకటి తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అల్పాహారం తీసుకుంటే మానసిక ఆరోగ్యం పైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే ఇవి లెప్టిన్ సెన్సిటివిటీ ని కూడా దెబ్బతీస్తాయి. కాబట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పొరపాటున కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్లను తీసుకోకూడదు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
"దొండకాయ పకోడీ" అంటే ఆ హీరోయిన్‌కి అంత ఇష్టమా.. ఎలా చేయాలంటే ?? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications