Health tips: ముఖాన్ని అందవిహీనం చేసే డబుల్ చిన్ సమస్య: తగ్గించుకోండిలా!!
చాలామంది డబుల్ చిన్ కారణంగా తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందంగా ఉండాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, డబుల్ చిన్ ముఖ అందాన్ని పాడు చేస్తుంది. గడ్డం దగ్గర కొవ్వు పేరుకుపోయి అదనపు లేయర్ లా డబుల్ చిన్ ముఖాన్ని అందవిహీనంగా చేస్తుంది.
ఈ డబుల్ చిన్ తగ్గడం కోసం చాలామంది అనేక ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. డబుల్ చిన్ తగ్గించే పరికరాలు కూడా వినియోగిస్తున్న వారు లేకపోలేదు. అయితే కొన్ని ఇంటి చిట్కాలను ద్వారా డబుల్ చిన్ ను ఈజీగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. డబుల్ చిన్ సమస్యతో బాధపడేవారు ముఖ కండరాలకు వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం వారు ఏదైనా తినేటప్పుడు బాగా నమిలి తినాలి.

దీని వల్ల అదనపు కొవ్వు పేరుకుపోకుండా ముఖానికి అందం పెరుగుతుంది. అంతేకాదు మార్కెట్లో లభించే షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ లను నమలడం వల్ల కూడా దవడల దగ్గర పేరుకున్న కొవ్వు తగ్గుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల కూడా డబుల్ చిన్ ను తగ్గించుకోవచ్చు. గ్రీన్ టీ శరీరంలోని జీవ క్రియలను వేగవంతం చేస్తుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది.
కాఫీ, టీలకు బదులుగా గ్రీన్ టీ ని డైట్ లో చేర్చుకోవడం వల్ల డబుల్ చిన్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అంతేకాదు నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు తో పాటు, దవడలు, గడ్డం కింద ఉండే కొవ్వు కూడా తగ్గుతుంది. అందుకే ప్రతి ఒక్కరు ప్రతి నిత్యం కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగడం మంచిదని చెబుతున్నారు.
అలాగే నీటిశాతం ఎక్కువగా ఉండే వాటిని ఆహారంలో చేర్చుకోవాలి అని సూచిస్తున్నారు. దీనివల్ల డబుల్ చిన్ తగ్గే అవకాశం ఉంది. బాగా కొవ్వు లేని ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల, గడ్డం క్రింద కొవ్వు పెరగదు. ఎక్కువగా నవ్వడం, మాట్లాడటం వంటి వ్యాయామాల ద్వారా ముఖ కండరాలు బలోపేతం అవుతాయి.
దీనివల్ల డబుల్ చిన్ తగ్గుతుంది అంతే కాదు ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో విటమిన్-ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇది కొవ్వు కరగడానికి, డబుల్ చిన్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. డబుల్ చిన్ తగ్గి ముఖ వర్చస్సు పెరుగుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
చేపలతో కలిపి తినకూడని ఆహార పదార్థాలు.. -
బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications