health tips: జుట్టు వేగంగా పెరగాలంటే ఈ నేచురల్ జ్యూస్ లు తాగండి!!
చాలామంది తమ జుట్టు ఊడిపోతుందని, జుట్టు త్వరగా పెరగడం లేదని తెగ బాధపడుతూ ఉంటారు. అయితే వారంతా ముందు ఆరోగ్యం పైన తగిన శ్రద్ధ చూపించాలి. ఆరోగ్యవంతుల జుట్టు బాగా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మంచి పోషకాహారం తినాలి. జుట్టు పెరగాలంటే కూడా అందుకు తగిన పోషణ ఉండాలి.
పొడవాటి, బాగా ఒత్తుగా ఉన్న, అందమైన నిగనిగలాడే నల్లటి జుట్టును ప్రతి మహిళ కోరుకుంటుంది. అటువంటి జుట్టును పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసేవారు కూడా లేకపోలేదు. అయితే ఇంట్లోనే మనం న్యాచురల్ గా తయారు చేసుకునే కొన్ని జ్యూస్ లు తాగడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందని చెబుతున్నారు. ఇక ఆ జ్యూసులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
క్యారెట్ జ్యూస్:క్యారెట్ జ్యూస్ ను తాగడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. క్యారెట్ జ్యూస్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ ఈ ఉంటాయి. ఇవి హెయిర్ ఫాలికల్స్ కు పోషణ ఇస్తాయి. దీనివల్ల జుట్టు బలంగా, దృఢంగా ఉంటుంది. త్వరగా పెరుగుతుంది. కాబట్టి జుట్టు బాగా పెరగాలని కోరుకునేవారు క్యారెట్ జ్యూస్ తాగొచ్చు.

పాలకూర జ్యూస్:జుట్టు బాగా పెరగాలి అంటే మనం ఇంట్లోనే నేచురల్ గా తయారు చేసుకునే మరొక జ్యూస్ పాలకూర జ్యూస్. పాలకూర జ్యూస్ తో కూడా జుట్టు బాగా వేగంగా పెరుగుతుంది. దీనిని రెగ్యులర్ గా తాగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నట్టు చెబుతున్నారు. పాలకూరలో మెగ్నీషియం, పొటాషియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి.దీనివల్ల హెయిర్ ఫాలికల్స్ ఆరోగ్యంగా ఉంటాయి.
ఉసిరికాయ జ్యూస్:జుట్టు బాగా పెరగాలి అనుకునేవారు ఉసిరికాయ జ్యూస్ ను తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఉసిరికాయ జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉసిరి రసంలో అనేక రకాల ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి జుట్టును దృఢంగా మరియు ఒత్తుగా చేస్తాయి.
కీర దోసకాయ జ్యూస్:జుట్టు బాగా పెరగాలని భావించేవారు ప్రతిరోజు కీరా దోసకాయ రసాన్ని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. కీరా దోసకాయ రసంలో క్యాల్షియం, సోడియం, సల్ఫర్, సిలికాన్ ఉంటాయి. అందుకే ప్రతిరోజు కీరా దోసకాయ రసాన్ని తాగితే మంచిదని, అది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం తో పాటుగా, జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహకరిస్తుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications