health tips: ఊపిరితిత్తులను శుభ్రం చేసే ఆహారాలు.. తప్పక తినండి!!
చాలామంది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు ఊపిరితిత్తులను శుభ్రపరుచుకోవాలి అంటే కొన్ని రకాల పదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. కొన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేసినట్టే, కొన్ని రకాల ఇంట్లో ఉపయోగించే ఆయుర్వేద పదార్ధాలు కూడా మేలు చేస్తాయి.
ఊపిరితిత్తులను శుభ్రపరిచే ఆహారాలలో తేనె చాలా ముఖ్యమైనది. తేనే ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే ప్రతిరోజు ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఒక స్పూన్ తేనెను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది.

అంతేకాదు పసుపు కూడా ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. ఊపిరితిత్తులను శుభ్రం చేసే క్రమంలో పచ్చి పసుపును వాడడం ఎంతో మంచిది అని చెబుతున్నారు. పచ్చి పసుపు కొమ్మును నమిలి తినినా, లేక పచ్చి పసుపును దంచి పాలల్లో కలుపుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి అని చెబుతున్నారు.
ఇక పచ్చి పసుపును వారానికి మూడు నాలుగు సార్లు తింటే సరిపోతుందని, ఇది శ్వాసకోశ సంబంధమైన సమస్యలను తగ్గించడానికి సహజంగా పనిచేసే నివారిణి అని చెబుతున్నారు. అంతేకాదు పసుపు రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుందని చెబుతున్నారు.
ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవాలనుకునే వారు ప్రతిరోజు ఒక చిన్న అల్లం ముక్కను ఏదో ఒక రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
అల్లం టీ తాగినా, ఏదైనా సలాడ్లలో అల్లం ను ఉపయోగించినా, మరే రకంగా అయినా నిత్యం అల్లం తీసుకున్నా అల్లం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అల్లం కూడా మన ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడేవారు, ఇన్ఫెక్షన్లతో సతమతమయ్యేవారు ఈ నేచురల్ రెమెడీస్ ను ట్రై చేసి ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుకోవచ్చు.












Click it and Unblock the Notifications