Health tips: మిరియాలతో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి!!
మిరియాలు... మసాలా దినుసుల రారాజుగా మిరియాలను చెబుతారు. మిరియాలను సరిగా ప్రతీరోజూ ఆహారంలో వాడితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు. ఆహారం రుచిని పెంచడమే కాకుండా బోలెడన్ని ఔషధ గుణాలతో మిరియాలు ఆరోగ్యాన్ని కాపాడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
మిరియాలలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ మరియు సోడియం తక్కువగా ఉంటాయి. విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కె, ఐరన్, కాపర్ మరియు మాంగనీస్ లతో మిరియాలు కూడుకొని ఉంటాయి. అయితే మిరియాలు అతిగా తీసుకున్నా అనేక ఇబ్బందులు వస్తాయి. ప్రతీరోజూ పరిమితంగా మిరియాలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం ఎంతో మంచిది. టైప్ టు డయాబెటిస్ తో బాధపడేవారు మిరియాలు ఆహారంలో భాగంగా తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. మిరియాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడు నియంత్రణలో ఉంటాయి. మిరియాలు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
నరాల సమస్యలు ఉన్నవారు మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది. మిరియాలను ఆహారంలో భాగంగా తినడం వల్ల మీ పొట్టకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. జీర్ణాశయ వ్యవస్థకు మిరియాల కారణంగా మేలు జరుగుతుంది. మిరియాలు జీర్ణక్రియను ఎంతో బాగా మెరుగుపరుస్తాయి. శరీర మెటబాలిజంను మిరియాలు పెంచుతాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించి మనల్ని ఆరోగ్యంగా ఉండేలా మిరియాలు చేస్తాయి.
మిరియాలు రోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఆర్థరైటిస్ తో బాధపడేవారు మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. మిరియాలు వైరల్ ఫీవర్ లను, గొంతు నొప్పి, జలుబు వంటి వాటిని తగ్గిస్తాయి. మిరియాలు యాంటీసెప్టిక్ గా కూడా ఉపయోగపడతాయి. ఇన్ని ప్రయోజనాలున్న మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకోండి. అనేక అనారోగ్య బాధల నుండి బయటపడండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
హోటల్ స్టైల్ "చికెన్ ఫ్రైడ్ రైస్" ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే..? -
యువతలో కొత్తరకం లైంగిక అలవాట్లు.. గొంతు క్యాన్సర్ ముప్పు తప్పదా..? -
సగ్గుబియ్యం దోసెలు.. ఇలా చేసి తింటే సూపర్ టేస్ట్! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!!












Click it and Unblock the Notifications