health tips: గురకతో నరకమా? ఈ ఇంటి చిట్కాలతో గురక నుండి రిలీఫ్!!

గురక.. ఇప్పుడు చాలా మంది ఇళ్లల్లో ఇబ్బందికరంగా మారిన సమస్య. గురక పెడుతూ పడుకునే వాళ్ళు ఇంట్లో ఉంటే, మిగతా కుటుంబ సభ్యులకు నిద్రపట్టదు. విపరీతంగా గురక పెట్టడం వాళ్లకే కాకుండా పక్క వాళ్లకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది. అధికంగా బరువు ఉంటేనో లేక గుండె సంబంధించిన సమస్యలు ఉంటేనో గురక వస్తుంది.

అయితే ఏ సమస్య లేకపోయినా గురక వచ్చే వారు కూడా ఉన్నారు. ఇక ఇటువంటి వారు గురక తగ్గటం కోసం కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిదని సూచన. గురక వచ్చేవారు రాత్రిపూట పడుకునే ముందు వేడి నీళ్లలో కొద్ది చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసుకుని ఆవిరిపడితే గురక సమస్య నుంచి కొద్దిగా రిలీఫ్ వస్తుంది.

health tips

అంతేకాదు రాత్రిపూట నిద్ర పోయే ముందు గోరువెచ్చని గ్లాసు నీళ్ళలో కొద్దిగా యాలకుల పొడి కలుపుకుని తాగితే కూడా గురక నిదానంగా తగ్గుతుంది. నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా విపరీతమైన గురక నుండి ఉపశమనం లభిస్తుంది. పెప్పర్మింట్ ఆయిల్ ను చేతికి రాసుకుని రాత్రి పడుకునే ముందు బాగా వాసన చూస్తే కూడా గురక తగ్గుతుంది.

ఇక గురక ఎక్కువగా వస్తున్న వాళ్ళు వెల్లకిలా పడుకోకూడదు. వారు ఒక వైపుకు తిరిగి పడుకోవడం వల్ల కొంతమేరకు గురక తగ్గుతుంది. గోరువెచ్చని నీళ్ళలో పసుపు కలుపుకుని తాగడం వల్ల కూడా గురక సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు గురక వచ్చే వాళ్ళు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గురక రాకుండా ఉండాలంటే పడుకునే ముందు జంక్ ఫుడ్ తినకూడదని సలహా ఇస్తున్నారు.

health tips:

ఇక రాత్రి భోజనంలో పచ్చి ఉల్లిపాయ తింటే కొంత గురక సమస్య నుండి ఉపశమనం దక్కుతుందని చెబుతున్నారు. ప్రతిరోజూ కొద్దిగా పచ్చి అటుకులు తినడం వల్ల కూడా గురక సమస్య నుండి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా పైన పేర్కొన్న చిన్నచిన్న చిట్కాలను ప్రయత్నించి గురక ను కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ అప్పటికీ గురక నియంత్రణలోకి రాకపోతే వైద్యుల సూచన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+