health tips: డయాబెటిస్ బాధితులు వారానికి ఎన్నిసార్లు కాకరకాయ తినొచ్చు!!
డయాబెటిస్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు సహజంగా డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడం కోసం చేదు పదార్థాలను తింటే మంచిదని చెబుతారు. అలా డయాబెటిస్ బాధితులు తినే చేదు పదార్థాలలో మెంతులతో పాటు, కాకరకాయ ఒకటి. చాలా మంది కాకరకాయ రసాన్ని నిత్యం తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందని చెప్తారు.
అయితే కాకరకాయలు తింటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది కానీ, కాకరకాయలను ఎలా తినాలి? ఎన్నిసార్లు తినాలి? కాకరకాయలు తినడం వల్ల జరిగే మంచి ఏంటి? ఎక్కువ తినడం వల్ల కలిగే నష్టం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. కాకరకాయ రుచిలో చేదుగా ఉంటుంది. అయితే కాకరకాయలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కాకరకాయ బరువును గణనీయంగా తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా కాకరకాయ తగ్గిస్తుంది. గుండెకు కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. కాకరకాయను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అయితే తక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నవారు కాకరకాయను తినకూడదు. ఇక కాకరకాయలు గర్భధారణ సమయంలో పిండానికి మంచివి కావు. కాబట్టి ఆ సమయంలో కాకరకాయలను తీసుకోకుండా ఉంటేనే మంచిది.
ప్రతిరోజు కాకరకాయలు తింటే కాలేయానికి హాని జరుగుతుంది. అజీర్ణ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కాకరకాయను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల డయేరియా సమస్య ఏర్పడుతుంది. డయాబెటిస్ బాధితులు ప్రతిరోజు కాకరకాయను తినడానికి బదులు వారానికి రెండు మూడు సార్లు మాత్రమే కాకరకాయలను తీసుకుంటే మంచిదని చెబుతున్నారు .
ఎవరైనా కాకరకాయను తినడం వల్ల కడుపునొప్పి సమస్యతో బాధపడితే అటువంటివారు నెయ్యి కలిపిన అన్నాన్ని తీసుకుంటే కొంతమేరకు ఉపశమనం లభిస్తుంది. శరీరానికి చేదు మంచిదే కానీ ప్రతిరోజు ఫుల్లుగా చేదుని శరీరానికి అందిస్తే ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. అందుకే డయాబెటిస్ బాధితులు కాకరకాయలను ఆహారంలో భాగం చేసుకునే సమయంలో ఎంత మొత్తం, ఎన్నిసార్లు తినాలో గుర్తు పెట్టుకోవటం మరచిపోవద్దు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications