health tips: బరువు తగ్గాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే.. బేసిక్ నియమాలివే!!
ఆరోగ్యంగా ఉండాలంటే బరువును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. విపరీతంగా ఒళ్లు పెంచేసి, బరువు తగ్గాలనే ఆలోచన వచ్చిన వెంటనే టక్కున తగ్గి పోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇక బరువు తగ్గాలని వీరలెవల్లో వర్కౌట్స్ చేయడం, ఫుడ్ పూర్తిగా మానేయడం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల పోషకాహారలోపం ఏర్పడుతుంది. అతి ఏదైనా మంచిది కాదు. కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఒకే రోజులో పెరిగిన బరువైతే, ఒకే రోజులో తగ్గించాలని ఆలోచన చేయొచ్చు. కానీ ఏళ్ల తరబడి పెంచిన బరువును ఒకేసారి తగ్గించాలి అనుకోవడం అసాధ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. బరువు తగ్గాలనే ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు, బరువు తగ్గడం కోసం నిరంతరాయంగా చేయవలసిన పనులను చేస్తూ, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే బరువు తగ్గి, ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది.

మరి బరువు తగ్గాలనుకునేవారు ఏం చేయాలంటే ప్రతి రోజు నీటిని పుష్కలంగా తాగాలి. మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో నీరు గణనీయమైన పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు టీలు, కాఫీలు తాగడం మానుకోవాలి. బ్లాక్ టీ లేదా మిల్క్ టీ తాగడానికి కూడా గుడ్ బై చెప్పాలి. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగాలి.
కీరదోసకాయను నిత్యం తినేలా చూసుకోవాలి. కీరా దోసకాయ శరీరాన్ని ఆల్కలీన్ గా మార్చటంలో ఎంతో సహాయపడుతుంది. ఇక కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను సాధ్యమైనంత ఎక్కువగా తినాలి. ఆయిల్ ఫుడ్స్, డీప్ ఫ్రై చేసిన వేపుళ్లను పూర్తిగా మానేయాలి. కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉండే ఆహారం తినకూడదు.
పాల పదార్థాలు, స్వీట్లు, కేకులు, జంక్ ఫుడ్, ఐస్ క్రీమ్స్, వంటివి తినడం పూర్తిగా మానేయాలి. కూల్ డ్రింక్స్ తాగకూడదు. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే తక్షణం మానుకోవాలి. శారీరక శ్రమ లేకుండా బరువు తగ్గడం అసాధ్యం. కాబట్టి బరువు తగ్గడానికి ఖచ్చితంగా ప్రతిరోజు వర్కౌట్స్ చేయాలి. ఇవి బరువు తగ్గాలి అని, ఆరోగ్యంగా ఉండాలని భావించేవారు కచ్చితంగా పాటించవలసిన బేసిక్ నియమాలు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications