health tips: డయాబెటిస్ కు అడుగు దూరంలో.. ప్రీ-డయాబెటిస్ లక్షణాలు తెలుసుకోండి!!
డయాబెటిస్ .. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద దీర్ఘకాలిక వ్యాధి. మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అయితే డయాబెటిస్ వచ్చేముందు ప్రీ డయాబెటిస్ ని గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేరకు డయాబెటిస్ బారి నుండి కాపాడుకోవచ్చు అని చెబుతున్నారు వైద్యులు.
ప్రీ డయాబెటిస్లో రక్తంలో గ్లూకోస్థాయిలో సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. అయితే మధుమేహం బాధితులకు ఉన్నంతగా ప్రీ డయాబెటిస్ బాధితులకు ఆ సమస్య ఉండదు. ప్రీ డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 100 మిల్లీగ్రాముల నుండి 125 మిల్లీగ్రాముల వరకు ఉంటాయి. హెచ్పీఏ1సీ స్థాయిలు 5.7 నుండి 6.4 వరకు ఉంటాయి. ప్రీ డయాబెటిక్ పేషంట్లలో దాదాపు 70 శాతం మంది డయాబెటిక్ అవుతారు.

ప్రీ డయాబెటిస్ ఉన్నవారు మూడు నుంచి ఐదు సంవత్సరాలలో మధుమేహం బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ ప్రీ డయాబెటిస్ ను గుర్తించేందుకు కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. ప్రీ డయాబెటిస్ ఉన్నవారు దృష్టి సమస్యలను ఎదుర్కొంటారు. ఇది కళ్ళపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. విజన్ బ్లర్ గా కనిపించడం, కొన్నిసార్లు విపరీతమైన తలనొప్పిగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి.
తరచుగా దాహం వేస్తూ ఉంటుంది. ఎక్కువగా మూత్ర విసర్జన, చిన్న చిన్న విషయాలకే భయాందోళనకు గురి కావడం వంటి లక్షణాలు ఉంటాయి. చిన్న పని చేసినా శరీరం అలసిపోయినట్టుగా భావన కలుగుతుంది. విపరీతమైన కోపం పెరుగుతుంది. అకస్మాత్తుగా హై బీపీ పెరుగుతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి. విపరీతంగా చెమట పోస్తుంది. శరీరం పొడిబారడం, అలర్జీలు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
తరచుగా ఏదో ఒక అంటు వ్యాధులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. పాదాలలో కూడా నొప్పి, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రీ డయాబెటిస్ లక్షణాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్ రాకుండా కాపాడుకోవడానికి కొంతమేరకు అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications