health tips: కళ్ళ ఆరోగ్యం కోసం ఆహారాలు!!
సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని ఇంద్రియాలలో కళ్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతటిది. ఈ అందమైన ప్రపంచాన్ని చూడడానికి మనల్ని అనుమతించేది కళ్ళు మాత్రమే. అందుకే కళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మంచి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. అయితే ఎలాంటి ఆహారం మన కళ్ళకు మేలు చేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది కంటిచూపు సజావుగా లేక కళ్లద్దాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారు కంటిచూపును మెరుగుపరిచే ఆహారాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కంటి చూపును మెరుగుపరుచుకోవాలి అనుకునే వారు క్యారెట్లను తినడం మంచిది. క్యారెట్ లో బీటా కెరోటిన్ మరియు లుటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.

కంటి చూపు మెరుగు పడటం కోసం పాలకూర తినడం మంచిది పాలకూరలో ఐరన్ తో పాటు విటమిన్ ఏ మరియు లుటిన్ ఉంటాయి. ఇవి కంటి సమస్యల నుండి మనకు ఉపశమనాన్ని కలిగించి మన దృష్టిని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.ఇక నారింజలో విటమిన్ సితో పాటు విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దీనిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
కంటి చూపు మెరుగుపరచుకోవడానికి చిలకడదుంపలను తీసుకోవడం ఎంతో అవసరం. చిలకడ దుంపలలో బీటా కెరోటిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది .ఉసిరి కాయలలో విటమిన్ సితో పాటు, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా పనిచేస్తుంది.
ఇక ఆకుపచ్చని ఆకుకూరలలో ఉండే పోషకాల వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మెరుగైన కంటి చూపు కోసం నేరేడు పండ్లను తినడం ఎంతో మంచిది. ఇందులో విటమిన్ ఏ తగినంత పరిమాణంలో లభిస్తుంది.కాబట్టి కళ్ళ ఆరోగ్యం కోసం తప్పని సరిగా ఈ ఆకుకూరలను, పండ్లను, కూరగాయలను ఆహారంలో భాగంగా చేసుకోండి. కళ్ళద్దాలకు గుడ్ బై చెప్పి నేరుగా అందమైన ప్రపంచాన్ని ఆస్వాదించండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications