health tips: ఈ హెల్త్ మంత్రాతో వయస్సును రివర్సింగ్ చేసి యవ్వనంగా కనిపించండి!!

సంవత్సరం గడుస్తున్న కొద్దీ మన వయసు పెరుగుతూనే ఉంటుంది. వృద్ధాప్యానికి చేరువ కావడం ప్రతి ఒక్కరికి అనివార్యం. అయితే కొంతమందికి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. కొంతమందికి కొంత ఆలస్యంగా వృద్ధాప్యం వస్తుంది. అయితే వృద్ధాప్యాన్ని రివర్సింగ్ చేసి యంగ్ గా కనిపించాలంటే కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మన ఆహార నియమాలను, మన జీవన విధానాన్ని మార్చుకుంటే వయసును కాస్త వెనక్కునెట్టి యంగ్ గా కనిపించవచ్చు.

దానికి చేయవలసిందల్లా వయస్సు త్వరగా మీద పడకుండా ఉండటం కోసం చిన్న, మధ్యవయసులో వీలైనంత ఎక్కువగా శాకాహారం తినాలి . ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. శాకాహారంతో ఎక్కువ ప్రోటీన్ లభించేలా చూసుకుంటే వృద్ధాప్యాన్ని కాస్త దూరం నెట్టవచ్చు. అప్పుడప్పుడు ఉపవాసం చేయడం వల్ల కూడా వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. ఉపవాసం వల్ల శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయి.

skin-care-

దీంతో అది ముసలితనం త్వరగా రాకుండా చేస్తుంది. ఐదు రోజులపాటు కేవలం 4వేల 500 కేలరీలు మాత్రమే తీసుకుంటే శారీరక వయస్సు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి ఉపవాసం కూడా మన వయసును తగ్గిస్తుంది. వయసు వెనక్కి వెళ్లడానికి, మనం యంగ్ గా కనిపించడానికి కీలకమైనది, ముఖ్యంగా చేయవలసింది వ్యాయామం. వ్యాయామం చేస్తే శరీరం యవ్వనం దిశగా మళ్ళుతుంది.

ప్రతిరోజు సైకిల్ తొక్కినా, పుషప్స్, జంపింగ్ జాక్స్ వంటివి ఏమైనా చేసినా శారీరక సామర్థ్యం పెరుగుతుంది. కండరాలు దృఢమవుతాయి. కాబట్టి వ్యాయామం అన్నిటికంటే యంగ్ గా కనిపించాలంటే ముఖ్యమైనదిగా భావించాలి. అందుకే సినీ సెలబ్రిటీలు ప్రతిరోజు వ్యాయామానికి తగిన ప్రాధాన్యత ఇస్తారు.వృద్ధాప్య ఛాయలు త్వరగా దగ్గరికి రాకుండా ఉండాలంటే యంగ్ గా కనిపించాలంటే కంటినిండా నిద్ర పోవడం కూడా అంతే అవసరం.

ఎవరైతే కంటినిండా నిద్ర పోతారో, ప్రతిరోజూ 7నుండి ఎనిమిది గంటలపాటు నిద్రిస్తారో వారు ఆరోగ్యంగా ఉంటారు. అటువంటి వారికి వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. 8గంటల కంటే ఎక్కువగా నిద్ర పోయినా ఆరోగ్యానికి మంచిది కాదు. అటువంటివారి ఆయుష్షు తగ్గే ప్రమాదం ఉంటుంది. మొత్తంగా వృద్ధాప్య ఛాయలు త్వరగా దగ్గరకు రాకుండా ఉండాలంటే శాకాహారాన్ని తీసుకోవడం, అప్పుడప్పుడు ఉపవాసం చేయడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, సరైన నిద్ర పోవడం అవసరం అని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+