Health tips: చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ ఆహార పదార్ధాలు డైట్‌లో భాగం చేసుకోండి!!

చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఆహారంలో మనం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహార పదార్ధాలు డైట్‌లో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గటం మాత్రమే కాకుండా బరువు కూడా తగ్గుతారు.

చాలామంది శరీరంలో విపరీతమైన చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. అటువంటివారు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడం కోసం ఆహారంలో మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ జంక్ ఫుడ్ వల్ల వస్తుందని న్యూట్రిషనిస్టులు, వైద్యులు చెబుతున్నారు.

చెడు కొలెస్ట్రాల్ వల్ల అన్నీ అనర్ధాలే..

చెడు కొలెస్ట్రాల్ వల్ల అన్నీ అనర్ధాలే..


విపరీతంగా నూనె వాడకం, వేపుడు పదార్థాలను తినడం, కూల్ డ్రింక్స్, వల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగిపోతుందని, ఫలితంగా ఒబేసిటీ బారినపడి అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఊబకాయం వస్తుంది, ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కండరాల నొప్పులు, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ ఆహారం తీసుకోండి

చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ ఆహారం తీసుకోండి

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఎటువంటి ఆహార పదార్థాలను తినాలి అని తెలుసుకోవాలనుకునేవారు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయాలు ఇవే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని బాధపడేవారు, కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగే ఆహారాన్ని కాకుండా, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారాన్ని తీసుకోవాలి. అలా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారంలో పండ్లు ముఖ్యమైనవి. ఏదైనా తినాలి అనిపించినప్పుడు నూనెతో తయారుచేసిన, రకరకాల పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలను కాకుండా, జంక్ ఫుడ్స్ ను కాకుండా పండ్లు తీసుకోవాలి.

ఈ పండ్లతో చెడు కొలెస్ట్రాల్ కు చెక్..

ఈ పండ్లతో చెడు కొలెస్ట్రాల్ కు చెక్..

ముఖ్యంగా బరువు తగ్గించే బొప్పాయి, జామ, ఆపిల్, స్ట్రాబెరీ, ఆరెంజ్, అవకాడో వంటి పండ్లను తీసుకోవడం వల్ల పండ్లు చెడు కొలెస్ట్రాల్ ను పెరగకుండా నియంత్రిస్తాయి. మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్లు, మినరల్స్ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. బరువు తగ్గాలి, శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకోవాలి అని భావించే వారు కార్బోహైడ్రేట్లను ఆహారంలో తక్కువగా తీసుకోవాలి.

ఆహారంలో వీటిని భాగం చేసుకోండి.. చెడు కొలెస్ట్రాల్ నుండి రక్షణ

ఆహారంలో వీటిని భాగం చేసుకోండి.. చెడు కొలెస్ట్రాల్ నుండి రక్షణ

అంతేకాదు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నవారు ఓట్స్ ను ఆహారంలో భాగంగా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గటమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓట్స్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల 25 నుండి 35 గ్రాముల ఫైబర్ శరీరానికి అందుతుంది. కొవ్వు కరిగించడానికి ఓట్స్ ఎంతగానో దోహదం చేస్తుంది. అందుకే ఓట్స్ ను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

చిరు ధాన్యాల ఆహారాలను తీసుకోవాలి.. బీన్స్ తో భలే రిజల్ట్స్

చిరు ధాన్యాల ఆహారాలను తీసుకోవాలి.. బీన్స్ తో భలే రిజల్ట్స్


ఇక శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం కోసం బార్లీ జావను, రాగి జావను, జొన్న గడకను తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకుంటే గుండె సంబంధిత సమస్యల నుండి రక్షణ పొందే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. అంతే కాదు శరీర బరువు తగ్గడానికి, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి బీన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. బీన్స్ లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల, బీన్స్ తీసుకుంటే శరీరంలో కొవ్వు కరుగుతుందని సూచిస్తున్నారు.


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+