health tips: తరచూ అనారోగ్యమా? కారణం ఇదే కావచ్చు!!
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యం పైన ప్రధానంగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. మనం తీసుకుంటున్న ఆహారం ఏమిటి? మన జీవన విధానం ఏమిటి? ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే జీవనశైలిని అలవర్చుకోవాలి. లేదంటే అనారోగ్యాల బారిన పడటం ఖాయం.
చాలామంది ఏ చిన్న పని చేసినా అలసటకు గురి కావడం, రాత్రి సమయాలలో నిద్రలేమి సమస్యను ఎదుర్కోవడం, తరచుగా అనారోగ్యాలకు గురి కావడం, వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం, తరచూ జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉండడం అనేక సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం. అంతేకాదు కండరాల నొప్పులు, నరాల నొప్పులు, వాపును వంటి సమస్యలతో బాధపడుతూ ఉండడాన్ని కూడా చూస్తున్నాం.

కండరాలు, నరాల బలహీనతలు, నొప్పులు మాత్రమే కాదు జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా చాలామందిలో కనిపిస్తున్నాయి. పైన పేర్కొన్న అన్ని సమస్యలకు మన శరీరంలో ఒక విటమిన్ లోపం కారణమని వైద్యులు చెబుతున్నారు. అది అత్యంత ముఖ్యమైన విటమిన్ గా చెబుతున్నారు. మన శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే పైన పేర్కొన్న సమస్యలన్నీ కనిపిస్తాయని, ఈ లక్షణాలు ఉంటే విటమిన్ డి లోపం ఉందని గుర్తించాలని చెబుతున్నారు.
ప్రతి ఒక్కరి శరీరానికి విటమిన్ చాలా ముఖ్యమైన పోషక మని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ డి శరీరంలో ఎముకల పటిష్టతకు, నరాలు, కండరాల బలానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ప్రధానంగా విటమిన్ డి మనకు ప్రకృతి నుంచి అందుతుంది. సూర్యరశ్మి నుండి మన శరీరానికి విటమిన్ డి వస్తుంది. అంతేకాదు మనం తీసుకునే పౌష్టిక ఆహారం వల్ల కూడా విటమిన్ డి లోపం భర్తీ అవుతుంది.
అయితే విటమిన్-డి లోపాన్ని గుర్తించకుండా అలాగే ఉంటే మాత్రం తీవ్రంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మానసికంగానూ డిప్రెషన్ కు గురిచేస్తుంది. కాబట్టి విటమిన్ డి లోపాన్ని పోగొట్టుకోవడానికి విటమిన్ డి పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడంతో పాటు, ఉదయం పూట సూర్యరశ్మిని శరీరానికి తగిలేలా చూసుకోండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications