Health tips: హైబీపీ ఉందా? అయితే బీపీ తగ్గించే ఈ పండ్లు తినండి!!

సరైన జీవన విధానం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, విపరీతంగా పెరిగిన పని ఒత్తిడి వంటి వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా బీపీ బాధితులు పెరిగిపోయారు. భారతదేశంలో బిపి ఒక ప్రధాన అనారోగ్య సమస్యగా మారింది. ప్రతి పది మందిలో ఐదుగురు బీపీ రోగులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. బిపి వచ్చిన వారి ప్రతి రోజు ఉదయం తప్పనిసరిగా టాబ్లెట్ వేసుకుంటారు.

బీపి కంట్రోల్ లో ఉంచుకోవడానికి మందులు వాడటం వారికి తప్పనిసరిగా మారుతుంది. ఇక ఇదే సమయంలో ఉప్పు తగ్గిస్తే కూడా బీపి కంట్రోల్ లో ఉంటుందని చాలామంది నమ్ముతారు.అయితే బీపీ కంట్రోల్ లో ఉండాలంటే మందులు, ఉప్పు తగ్గించడం కంటే వ్యాయామం, సరైన ఆహారపు అలవాట్లు ఉండాలి. ఇక బీపీ ని కంట్రోల్ చేయడానికి పండ్లు కూడా ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు.

high BP

హై బీపీని తగ్గించే పండ్ల విషయానికి వస్తే సిట్రస్ పండ్లతోటి హైబీపీని కంట్రోల్ చేయవచ్చు. కమలా, నారింజ, బత్తాయి వంటి పండ్లు తినడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. వేసవి కాలంలో వచ్చే మామిడి పండ్లను తింటే కూడా బీపీ ని కంట్రోల్ చేయవచ్చు. హైబీపీని కంట్రోల్ చేయడానికి మామిడిపండు ఎంతగానో ఉపయోగపడుతుంది.

కేవలం బీపీ సమస్య ఉన్నవారు ఎండాకాలంలో ప్రతి రోజు ఒక మామిడిపండును తినవచ్చు. తద్వారా బీపీ కంట్రోల్ లో ఉంటుంది.డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండ్ల విషయంలో జాగ్రత్త. ఇక ఎండాకాలంలో దొరికే పుచ్చకాయను కూడా తినడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది పుచ్చకాయలో ఉండే ఫైబర్, విటమిన్ సి, పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తాయి.

ఇక అన్ని కాలాలలోనూ దొరికే అరటి పండ్లను బీపి కంట్రోల్ చేయడానికి తింటే మంచిదని చెబుతారు. అరటి పండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు బీపీని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. దానిమ్మ పండ్లను తింటే కూడా హై బీపీ తగ్గుతుంది.

దానిమ్మ పండ్లలో ఉండే విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి వంటి ఎన్నో పోషకాలు అధిక రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడతాయి. కివి పండ్లు కూడా రక్తపోటును కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఒక కివి పండును తిన్నట్లయితే హై బీపీ కంట్రోల్ లో ఉంటుందని చెబుతారు. కివిలో పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+