health tips: మహిళల్లో ప్రోటీన్ లోపం వల్ల కనిపించే లక్షణాలు!!

మహిళలకు అత్యంత ముఖ్యమైన పోషకాలలో ప్రోటీన్ ఒకటి. ప్రోటీన్ లోపం వల్ల మహిళలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రోటీన్ లోపం ఉంటే మహిళలు ఎటువంటి సమస్యలు కనిపిస్తాయి? ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ప్రోటీన్ లోపం ఉన్న మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.

తమకు తెలియకుండానే అనేక అనారోగ్య సమస్యల బారిన పడతారు. మహిళలలో ప్రోటీన్ లోపం ఉంది అని గుర్తించడానికి ముఖ్యంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి. మీరు మునుపటి కంటే త్వరగా అలసిపోయి, శరీరంలో బలహీనంగా అనిపిస్తే అది ప్రోటీన్ లోపానికి సంకేతం అని చెబుతున్నారు.

Health tips: Symptoms of Protein Deficiency in Women!!

అంతేకాదు చాలామంది తరచూ అనారోగ్యం బారిన పడుతుంటారు. అటువంటి వారిలో కూడా ప్రోటీన్ లోపం ఉంటుందని చెబుతున్నారు. అలాంటివారు వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. మీ జుట్టు మరియు గోర్లు బలహీనంగా మారినట్లు, జుట్టు చిట్లి పోయి రాలిపోతుంటే, గోర్లు తరచూ విరిగి పోతుంటే ప్రోటీన్ లోపం ఉందని అర్థం చేసుకోవాలి .ఇది కూడా ప్రోటీన్ లోపం యొక్క సంకేతంగా తెలుసుకోవాలి.

చర్మం యొక్క మెరుపు తగ్గిపోతుంటే, చర్మం తరచూ పొడిబారుతున్నట్లు అయితే ప్రోటీన్ లోపానికి సంకేతంగా గుర్తించాలి. మానసికంగా అస్థిరంగా ఉండడం, తరచూ మానసిక సమస్యలకు గురి కావడం, చేతులు మరియు కాళ్లల్లో వాపులు రావడం, ప్రధానంగా మహిళల్లో ప్రోటీన్ లోపానికి సంకేతమని చెబుతున్నారు.

శరీరానికి కావలసిన ప్రోటీన్ కోసం మహిళలు గుడ్లు, చేపలు, పప్పులు, చీజ్, పాలు, నెయ్యి, బాదం, మరియు ఓట్స్ మొదలైన వాటిని తీసుకోవాలని చెబుతున్నారు ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం తో పాటు ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేయాలని, వ్యాయామం మరియు యోగా వంటివి చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తున్నారు.

శరీరానికి కావలసిన ప్రోటీన్ అందితే శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఫలితంగా మనం ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాం. కాబట్టి మహిళలు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినడానికి ప్రయత్నించాలి. అప్పుడే ప్రోటీన్ లోపాన్ని నివారించగలుగుతారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+