Health tips: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.. నమ్మండి!!
ఎప్పుడూ ఇంటెడు చాకిరితో అలసిపోయే మహిళలకు తమ ఆరోగ్యం విషయంలో విపరీతమైన నిర్లక్ష్యం ఉంటుంది. ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఒక టాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుందిలే అనే ధోరణి మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో కుటుంబసభ్యుల అవసరాలు తీర్చే మహిళలు, భర్త అవసరాలు తీరుస్తూ, పిల్లలను తీర్చిదిద్దుతూ పెంచే మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబ ఆరోగ్యంగా ఉంటుంది అన్న విషయాన్ని మహిళలు ముందుగా గుర్తించాలి. ఉద్యోగాలు చేసే మహిళలు సైతం ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా మహిళల్లో పోషకాహార లోపం ఉంటుంది. దీనివల్ల మహిళలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మహిళలు పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి.

అంతేకాదు మహిళలు పిల్లల్ని కనటం వంటి పునరుత్పత్తి కారకాలతో కూడా శక్తి హీనులుగా మారుతున్నారు. మహిళలలో విటమిన్ డీ3 లోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే వారిలో ఎముకల పుష్టి కోసం, 35 సంవత్సరాల వయసు నుండే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
మహిళలలో ప్రతీనెలా రుతు చక్రం కారణంగా కూడా రక్త హీనత ఏర్పడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గుతుంది. ఐరన్ లోపం వస్తుంది. కాబట్టి మహిళలు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇక ఉద్యోగంతో పాటు ఇంటిని మెయింటైన్ చేస్తున్న మహిళలలో మానసిక ఒత్తిడి, డిప్రెషన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మహిళలు మానసికఆరోగ్యం కోసం కూడా తగిన ప్రయత్నాలు చెయ్యాలి. మానసిక ఆరోగ్యం కోసం యోగా చెయ్యటం మంచిది.
ఇక మహిళలు ప్రతీరోజూ వ్యాయామం చెయ్యటం మంచిది. శారీరక ఆరోగ్యం కాపాడుకుంటేనే మానసికంగానూ బలంగా ఉంటారు. కాబట్టి శారీరక ఆరోగ్యంపై ముందు ప్రధానంగా దృష్టి సారించాలి. ఇంట్లో ఎంత పని ఒత్తిడి ఉన్నా మహిళలు తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కనీసం ఆరు నెలలకు ఒకసారైనా జనరల్ చెకప్ చేయించుకోవాలి.
ఇటీవల కాలంలో మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న కారణంగా మహిళలు క్యాన్సర్ పై అవగాహనతో పాటు ప్రతీ ఆరు నెలలకు ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఇలా మహిళలు తమ ఆరోగ్యాన్ని ముందు కాపాడుకుంటే కుటుంబాన్ని కాపాడగలుగుతారు. కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటె సమాజం ఆరోగ్యకర సమాజంగా మారుతుంది. కాబట్టి మహిళలూ మీ ఆరోగ్యం విషయంలో మీదే బాధ్యత.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications