health tips: ఈ నూనెతో వృద్ధాప్యం వెనక్కు!!
చాలామంది వృద్ధాప్యం నుండి బయటపడడం కోసం, వృద్ధాప్య ఛాయలను త్వరగా రాకుండా చేయడం కోసం రకరకాల మాయిశ్చరైజింగ్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తారు. యాంటీ ఏజింగ్ సీరమ్ లను, యాంటీ ఏజెంట్ క్రీములను, రకరకాల ఆయిల్స్ ను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వృద్ధాప్యం త్వరగా రాకుండా నివారించడానికి మాత్రమే కాకుండా, మన శారీరక ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడే ఒక ఆయిల్ గురించి మనం తెలుసుకుందాం.
అదే గంధపు నూనె గంధపుచెట్టు నుండి గంధపు నూనెను తయారు చేస్తారు. గంధపు చెక్కల నుండి సుగంధ భరితమైన గంధపు నూనె తయారవుతుంది. ఈ నూనె అన్ని శారీరక, మానసిక రుగ్మతలు యొక్క చికిత్సల కోసం ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. ఒక మంచి సువాసన కలిగిన ఆహ్లాదకరమైన గంధపు నూనెను మానసికంగా రిలాక్స్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

చర్మానికి జుట్టుకి ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మాత్రమే కాకుండా దీనిని అందం ఇనుమడింప చేయడానికి కూడా ఉపయోగిస్తారు. గంధపు నూనె ఒక అద్భుతమైన సహజమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ గా ఉంచుతుంది. గంధపు నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది శరీరం పై వచ్చే రాష్ మరియు వాపు వంటి సమస్యలను నివారిస్తుంది.
గంధపు నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలను నయం చేయడానికి చర్మం పై ఉన్న మచ్చలు, మరకలను తొలగించడానికి ఉపయోగపడతాయి. గంధపు నూనెలోఆస్ట్రింజెంట్ గుణాలు చర్మ దృఢత్వాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా గంధపు నూనెలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఏజింగ్ లక్షణాలు త్వరగా రాకుండా కాపాడతాయి.
ఇది చర్మం యొక్క అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. త్వరగా ముసలితనం రాదు. గంధపు నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది . గంధపు నూనెతో ఎగ్జిమా, సోరియాసిస్ వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కాబట్టి అనేక సమస్యలకు బెస్ట్ రెమిడీ అయిన గంధపు నూనె వాడే ముందు. కాస్త చేతికి రాసుకుని టెస్ట్ చేసుకున్నాకే తీసుకోండి.












Click it and Unblock the Notifications