health tips: 50ఏళ్ళ తర్వాత కూడా యవ్వనంగా ఉండాలంటే చెయ్యాల్సింది ఇదే!!
వయసు పైబడుతున్నా యవ్వనంగా ఉండాలి అని ఎవరు కోరుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని, చూసేవారికి యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ వయసుతో పాటు వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. అయితే మన మంచి ఆహారపు అలవాట్లతో వృద్ధాప్యాన్ని కాస్త ఆలస్యం చేయవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధాప్యం వస్తుంది. దీనిని ఆపటం ఎవరి తరం కాదు కానీ మంచి జీవన విధానం ఉంటే వృద్ధాప్యాన్ని కాస్త ఆలస్యం చేయవచ్చు. ఆరోగ్యంగా నిత్యజీవనంగా ఉండాలి అనుకునేవారు ఆహారం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. హెల్తీ డైట్ మాత్రమే మనిషిని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతుందని అటువంటి హెల్తీ డైట్ ను నిత్యం తీసుకోవడం వల్ల యవ్వనంగా ఉంటారని చెబుతున్నారు.

ఇక యవ్వనంగా ఉండాలి అనుకునేవారు ముందు ప్రాసెస్డ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. మైక్రో ఓవెన్ లో వండిన ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. స్వీట్లు, కాఫీలు, కూల్ డ్రింక్ లకు గుడ్ బై చెప్పాలి. ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మీగడ తీసేసిన పెరుగును తింటే మంచిది. ఇంకా చెప్పాలంటే పాలపదార్థాలకు కాస్త దూరంగానే ఉండాలి. నియమిత సమయానికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం ప్రతిరోజు ఒకటే సమయానికి లంచ్, రాత్రి పడుకోవడానికి రెండు మూడు గంటల ముందు డిన్నర్ చేయాలి.

శరీర బరువును పెంచే, పోషకాలు లేని ఆహార పదార్థాలను తగ్గించి మంచి పోషకాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న పండ్లను, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలను నిత్యం తినాలి. కొలాజిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. స్ట్రాబెరీలు, బ్లాక్ బెర్రీలు, బ్రోకలీ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. నిత్యం కనీసం 10 గ్లాసుల నీటిని తాగాలి. తృణధాన్యాలు, వెజిటబుల్ సలాడ్లు, పండ్ల రసాలు ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
చక్కని ఆహార నియమాలతో ప్రతిరోజు క్రమ పద్ధతిలో, ఒకే సమయానికి భోజనం చేయడం ద్వారా, నీటిని సాధ్యమైనంత ఎక్కువగా తాగడం ద్వారా 50 ఏళ్ళ వయసులోనూ యవ్వనంగా కనిపించొచ్చు. ఇక ఆహార నియమాలతో పాటు వ్యాయామం, ఒత్తిడిని కూడా తగ్గించుకుంటే నిత్య నూతన యవ్వనం మీ సొంతమవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications