Health tips: నిద్రకు ముందు ఈ 5పనులు చేస్తే 50ఏళ్ల వయసులోనూ యవ్వనం!!

చాలామంది చిన్నవయసులోనే చర్మం ముడతలు పడి, వృద్ధాప్య ఛాయలు వచ్చాయని బాధపడుతూ ఉంటారు. అయితే చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు రావడం వెనక వారి జీవన శైలి కారణమని చెబుతున్నారు వైద్యులు. సరైన జీవన శైలితో, మంచి ఆహారపు అలవాట్లతో, నిద్ర అలవాట్లతో జీవనం సాగిస్తే చాలాకాలంపాటు యవ్వనంగా ఉంటారని చెబుతున్నారు.

ముఖ్యంగా రాత్రిపూట నిద్ర పోయే ముందు ఒక 5 పనులు చేస్తే లో కూడా యవ్వనంగా ఉంటారని చెబుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, విపరీతంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను వాడటం, సరిగ్గా నిద్రపోకపోవడం, వారికే అర్థంకాని జీవనశైలి చాలా మందిని చిన్న వయసులోనే వృద్ధాప్యం వచ్చేలా చేస్తుంది. అంతేకాదు వారి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది.

sleep

అయితే అలా చిన్న వయస్సులో వృద్ధాప్యం రాకుండా ఉండడం కోసం ఆరోగ్యంగా ఫిట్ గా ఉండడం కోసం పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. 50 ఏళ్ల వయసులో కూడా యవ్వనం గా కనిపించాలంటే.. ముఖ్యంగా 5 పనులు చేయాలి.అవేమిటంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పోషకాలు అధికంగా ఉండే తృణ ధాన్యాలను, డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి. ఇవి చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఫలితంగా చిన్న వయసులోనే చర్మంపై ముడతలు రావు. ఇవి వృద్ధాప్య సంకేతాలను నివారిస్తాయి. ఇక ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు సెల్ ఫోన్ చూడటం, ల్యాప్ ట్యాప్ లను చూడటం అలవాటు ఉంటే మానుకోవాలి. అంతేకాదు రాత్రిపూట కచ్చితంగా ఏడెనిమిది గంటల పాటు నిద్రపోవాలి. రాత్రిపూట నిద్ర పోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయే వారి చర్మం కాంతివంతంగా ఉంటుంది.

ప్రతిరోజు రాత్రి సమయంలో నిద్ర పోయేముందు కొంత సమయం పాటు ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత కలగడంతో పాటు అది శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఆరోగ్యంతో పాటు శక్తివంతంగా ,ఉత్సాహంగా, యవ్వనంగా ఉండడానికి ధ్యానం దోహదం చేస్తుంది.

రాత్రిపూట పడుకునే ముందు పొరపాటున కూడా కాఫీ, టీ వంటివి తాగకండి. ఒకవేళ ఆ అలవాటు ఉంటే వదిలేయండి. ఇది నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. రాత్రిపూట నిద్ర పోయే ముందు 5 పనులు చేస్తే ఖచ్చితంగా చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+