health tips: చలికాలంలో వేధించే ఒళ్ళునొప్పులు ఈ ఇంటి చిట్కాలతో చిటికెలో మాయం!!

చలికాలం వచ్చిందంటే చాలు చాలామంది భరించలేని ఒళ్ళు నొప్పులు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, భుజాల నొప్పులు, మెడనొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలంలో శరీరంలో నొప్పి మరియు దృఢత్వం తరచుగా సంభవిస్తుంది. చలికాలంలో ఈ విధమైన నొప్పులు ఒక సాధారణ సమస్యగా పరిగణించాలి. ఇలా చలికాలంలో ఉన్న నొప్పులు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

అయితే నొప్పులు భరించలేక చాలామంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. నొప్పుల కోసం ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం మంచిది కాదని సూచించబడింది. ఇక చలికాలంలో నొప్పుల నుంచి బయటపడటం కోసం కొన్ని హోమ్ రెమెడీస్ ను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. వాటి ద్వారా మనం చలికాలంలో బాధించే నొప్పుల నుండి బయటపడవచ్చు.

health tips: Try these home remedies for body pains and joint pains in winter

చలికాలం శరీరం విపరీతంగా నొప్పులతో బాధిస్తుంటే, నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఒక బకెట్ నీటిని వేడి చేసి అందులో రెండు కప్పుల ఆపిల్ సైడర్ వెనిగర్ ను జోడించి ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. ఈ నీటిని స్నానం చేయడానికి ఉపయోగిస్తే ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అల్లం లో మెండుగా ఉంటాయి. మన శరీరం నొప్పి నుంచి బయటపడడానికి ఇది చాలా ఎఫెక్టివ్ హోమ్ రెమిడి గా పరిగణించబడుతుంది. కొద్దిగా అల్లాన్ని గ్రైండ్ చేసి ఓ గుడ్డలో కట్టి ఆపై దానిని కొన్ని నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచి బాగా మరిగించాలి.

అల్లం రసం నీళ్ళలోకి దిగి మెరిగిన తర్వాత దానిని చల్లారబెట్టి, బాగా నొప్పి ఉన్న భాగంలో పూయాలి. 15 నిమిషాల పాటు ఆ అల్లం రసాన్ని నొప్పి ఉన్న భాగంలో మర్దన చేస్తూ ఉంటే అప్పుడు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక శారీరక నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి పసుపు పాలు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అంతేకాదు ప్రభావిత భాగానికి పసుపు పేస్టును పోయడం వల్ల కూడా నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇది కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కండరాల దృఢత్వం అంటే సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగపడుతుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో దాల్చిన చెక్క పొడిని వేసి మరిగించి తాగితే ఫలితం ఉంటుంది. అంతేకాదు శరీరంలో ఎక్కడైనా నొప్పి వేధిస్తుంటే కొద్దిగా ఆవాల నూనెను తీసుకుని వేడి చేసి, నొప్పి ఎక్కువగా ఉన్న భాగంలో మర్దన చేస్తే కూడా ఫలితం బాగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+