Health tips: యూరిక్ యాసిడ్ పెరుగుతుంటే ఈ పండ్లను తినకండి!!
రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడమనేది పెద్ద సమస్య. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుదల గౌట్, అధిక రక్తపోటు, ఊబకాయం మరియు ఆర్థరైటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. కాబట్టి శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుదలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. యూరిక్ యాసిడ్ సమస్య ఉత్పన్నం అవుతుంటే, యూరిక్ యాసిడ్ శరీరంలో పెరుగుతుంటే కొన్ని పండ్లను తినకూడదని చెబుతున్నారు వైద్యులు. మరి ఆ పండ్లు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంటే ద్రాక్ష పండ్లను తినకూడదు. ద్రాక్షపండ్లలో ఫ్రక్టోస్ పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉన్న రోగులకు ఇది హానికరంగా మారుతుంది. ఎక్కువ యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు ద్రాక్ష పండ్లకు దూరంగా ఉండాలి. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు పుచ్చకాయలను కూడా తినకూడదు. పుచ్చకాయతో యూరిక్ యాసిడ్ సమస్య మరింత పెరుగుతుంది. ఇది మరింత డేంజర్ అని చెప్తున్నారు.

యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు సపోటా లను తినకూడదు. సపోటాలలో ఫ్రక్టోజ్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. దీనివల్ల యూరిక్ యాసిడ్ బాగా పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ సమస్య పెరిగితే పియర్స్ పండ్లకు దూరంగా ఉండడం మంచిది. ఇందులో కూడా ఫ్రక్టోజ్ అధికంగా ఉండడం వల్ల ఈ పండ్లను తింటే యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి.
యూరిక్ యాసిడ్ సమస్యలకు యాపిల్ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది కానీ, యూరిక్ యాసిడ్ స్థాయిలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అధికంగా చక్కెర ఉండే ఈ పండ్లను తినకుండా ఉంటేనే మంచిది. పైనాపిల్లో అధిక మొత్తంలో ఫ్రక్టోజ్ ఉంటుంది కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారికి ఇది హానికరంగా మారుతుంది. ఇది గౌట్ సమస్యకు కారణంగా మారుతుంది.
యూరిక్ యాసిడ్ నియంత్రణలో లేనివారు రేగుపండ్లను అధికంగా తినడం మంచిది కాదు. ఇక యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు అరటిపండు, అవకాడో, బెర్రీలు వంటి కొన్ని పండ్లను తినవచ్చు. అయితే ఏదైనా అధిక మొత్తంలో ఏ పండునైనా తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications