Health tips: ఉదయం టిఫిన్ తినకుంటే ఎన్ని ప్రమాదాలో తెలుసా!!
చాలామంది ఉదయం అల్పాహారం తీసుకోవడంలో అశ్రద్ధ వహిస్తారు. టిఫిన్ చేసుకొని తినాలంటే బద్దకిస్తారు. ఇంట్లో పనులు మొత్తం పూర్తయిన తర్వాత ఎప్పటికో టిఫిన్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే మొత్తానికి మొత్తమే టిఫిన్ తినకుండా ఉంటారు .అయితే ఇది ఏమాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు డైటీషియన్లు.
ఉదయం పూట అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. రాత్రివేళ ఆలస్యంగా తినడం, ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం చేస్తే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. సరిగ్గా తినకపోయినా, సమయానికి తినకపోయినా బరువు పెరగడం ఖాయమని చెబుతున్నారు. క్రమ పద్ధతిలో అల్పాహారం తినడం తోనే బరువు పెరగకుండా ఉంటారని చెబుతున్నారు.

ఉదయం అల్పాహారంలో ఓట్స్, బార్లీ వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయని, శరీరం లైట్ గా ఉంటుందని, రోజంతా ఉత్సాహం ఉంటుందని చెబుతున్నారు. తృణధాన్యాలు, ప్రోటీన్లు, పండ్లు, ఆకుకూరలను అల్పాహారంలో తీసుకోవాలని, వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని, అప్పుడే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు.
రోజూ అల్పాహారం నియమిత సమయానికి తీసుకోవడంతో శరీరంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు. మధుమేహం ఉన్న వారితో పాటు మధుమేహం లేని వారు కూడా టిఫిన్ విషయంలో సమయపాలన పాటించడం మంచిదని సూచిస్తున్నారు. అల్పాహారం తీసుకోవడంతో జీర్ణక్రియ సక్రమంగా ఉంటుందని, జీర్ణ సంబంధిత సమస్యలు రావని, సక్రమంగా హార్మోన్లు పనిచేస్తాయని చెబుతున్నారు.
టిఫిన్ సరిగ్గా తీసుకోకపోవడంతో దుష్ప్రభావాలు ఉంటాయని, అది మానసిక భావోద్వేగాల పైన కూడా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే ఆలోచనా తీరు మందగిస్తుందని, జ్ఞాపకశక్తి తగ్గుతుందని చెబుతున్నారు. అంతేకాదు రోజు బ్రేక్ ఫాస్ట్ చెయ్యకపోతే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని అంటున్నారు.
గుండె సంబంధిత జబ్బులు పెరుగుతాయని,గుండె పనితీరులో తేడాలు వస్తాయని చెబుతున్నారు. అల్పాహారం తీసుకోకపోతే వచ్చే దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని రోజు కచ్చితంగా టిఫిన్ చేయాలి. ఒకవేళ టిఫిన్ స్కిప్ చేస్తే అనారోగ్య సమస్యలు తలుపు తడతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications