గుండెపోటు హింట్ ఇచ్చే వస్తుంది.. ఈ లక్షణాలుంటే అలెర్ట్!
ప్రస్తుతం గుండెపోటు సమాజంలో సర్వసాధారణంగా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సైలెంట్ కిల్లర్ లా గుండెపోటు వేధిస్తోంది. ఇటీవల కాలంలో చాలామంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులను చూస్తున్నాం. వాస్తవానికి గుండెపోటు అనేది చాలా ప్రాణాంతకమైన వైద్య పరిస్థితి.
గుండె పోటుకు ముందు లక్షణాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 17.9 మిలియన్ల మంది హృదయ సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. ప్రతి ఐదుగురిలో నలుగురు గుండెపోటు కారణంగానే మరణిస్తున్నారు. అయితే గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే అనారోగ్య పరిస్థితి కాదు. గుండెపోటు రావడానికి ముందు కచ్చితంగా హింట్స్ ఇస్తుంది.. గుండెపోటు రావడానికి ముందు కొన్ని లక్షణాలు కచ్చితంగా కనిపిస్తాయి.

గుండెపోటుకు ముందు వీటిలో నొప్పి
ఆ లక్షణాలను గుర్తించి అప్రమత్తమైతే మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇక గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు ఏమిటి ప్రస్తుతం తెలుసుకుందాం.
గుండెపోటు వచ్చే ముందు ఛాతిలో లేదా వెన్నులో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి అకస్మాత్తుగా మొదలై కంటిన్యూగా ఉంటుంది అనిపిస్తుంది. ఇది ఒక రకమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ విధంగా ఎవరికైనా అనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయవద్దు.
ఎడమ చెయ్యి నొప్పిగా ఉంటే అలెర్ట్
గుండెపోటు వచ్చే ముందు భుజాలు మరియు మెడ కూడా నొప్పులకు గురవుతుంది. ఈ నొప్పి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వ్యాపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇది ఒక వైపున లేదా రెండు వైపులా కూడా అనుభూతిని కలిగిస్తుంది. గుండెపోటు రావడానికి ముందు ఎడమ చేయి విపరీతంగా నొప్పి పుడుతుంది. ఇలా ఎడమా చెయ్యి నొప్పి ఎక్కువగా ఉన్నవారు నిర్లక్ష్యం చేయవద్దు.
గుండెపోటు వచ్చే ముందు ఇలాంటి హింట్స్
గుండెపోటు వచ్చే ముందు దవడ ,దంతాలలో నొప్పి కలుగుతుంది. కొంతమందికి శ్వాస ఆడదు. విపరీతమైన అలసట కలుగుతుంది. ఇది గుండెపోటు వచ్చే ముందు కనిపించే సాధారణ లక్షణాలు. ఎవరైతే ఈ లక్షణాలతో ఇబ్బంది పడతారో వారు కచ్చితంగా మీ గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాల్సిందే. దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ ను సంప్రదించి గుండెపోటు రావడానికి ముందే జాగ్రత్త తీసుకుంటే స్ట్రోక్ బారి నుండి బయటపడవచ్చు.
ప్రతీ ఆరు నెలలకు గుండె చెక్ చేయించుకోండి
ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం ప్రతి ఆరు నెలలకు ఒకసారి గుండె ఆరోగ్యాన్ని కార్డియాలజిస్ట్ వద్దకు వెళ్లి చెక్ చేయించుకోవాలి. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే అప్పుడే తెలుస్తుంది. వెంటనే చికిత్స చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా కాకుండా సమస్య ప్రాణం మీదికి తెచ్చుకునేదాకా చూస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications