ఈ యోగాసనాలతో హైబీపీకి చెక్!!

చాలామంది ప్రస్తుతం బీపి తో బాధపడుతున్నారు. హై బీపీ తో మనకు తెలియకుండానే మన శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. బీపీని కంట్రోల్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అయితే బిపి పేషెంట్లు ప్రతిరోజు బీపీని కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్లు వేసుకుంటారు. టాబ్లెట్స్ ద్వారానే కాకుండా బీపీని కంట్రోల్ చేసుకోవడానికి సహజసిద్ధమైన మార్గాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది యోగా.

ఉత్తానాసనం
యోగాలోని కొన్ని ఆసనాలు మన బీపీని కంట్రోల్ చేస్తాయి. మరి ఆ ఆసనాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. హై బీపీని తగ్గించడానికి యోగాలో చెప్పబడిన ఉత్తానాసనం బాగా పనిచేస్తుంది. ఈ ఆసనాన్ని వేసేటప్పుడు వీపును వంచడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మన మెదడుకు కావాల్సిన రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది మన నరాలను శాంతింప చేస్తుంది. ఒత్తిడిని బాగా తగ్గించి ఇమ్యూనిటీని పెంచుతుంది.

High BP controls with these yoga asanas

సేతుబంధాసనం
బీపీని తగ్గించడానికి యోగాసనాలలో ఉన్న సేతుబంధాసనం బాగా పనిచేస్తుంది. ఈ ఆసనం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. తొడ, కాళ్లతో పాటు కండరాలు బలోపేతం అవుతాయి. ఛాతి భాగాన్ని పైకెత్తి తలభాగాన్ని కిందికి ఉంచి నడుము, కాళ్ల భాగాన్ని కూడా పైకి పెట్టి వేసే ఆసనం సేతుబంధాసనం. దీంతో శరీరంలోని అన్ని భాగాలకు, మెదడుకి రక్తప్రసరణ బాగా జరిగి ఒత్తిడిని తగ్గించి రక్తపోటు తగ్గేలా చేస్తుంది

త్రికోణాసనం
బీపీని తగ్గించడంలో త్రికోణాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది . త్రికోణాసనం అంటే త్రికోణంలా శరీరాన్ని వంచటం . ఇది శరీరంలోని నాడీ వ్యవస్థను, నరాలను బలోపేతం చేస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఛాతీని విస్తరింపజేస్తుంది. రక్త పోటు, ఒత్తిడిని తగ్గిస్తుంది. కాళ్లు రెండు దూరంగా పెట్టి ఒక చేతిని పైకి మరొక చేతిని పాదానికి తాకిస్తూ ఒక సైడుకు వంగి చేసే ఆసనం త్రికోణాసనం. ఈ ఆసనంతో రక్తపోటు తగ్గుతుంది.

యోగాసనాలతో బీపీ తగ్గాలంటే ఇలా చెయ్యండి
యోగా ద్వారా బీపీని తగ్గించుకోవాలనుకునే వారు మీరు యోగా చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. యోగా నిపుణుల పర్యవేక్షణలోనే ఈ ఆసనాలను వెయ్యాలి. ఇంటర్నెట్ లో చూసి ప్రయోగాలు అసలే చేయకండి. ఒకవేళ చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం లేకపోలేదు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+