యూరిక్ యాసిడ్ సమస్య, కీళ్ళ నొప్పులు, వాపులు మాయంచేసే వంటింటి చిట్కాలు!

అసలే చలికాలం. విపరీతమైన చలిలో చాలా మంది కీళ్లవాపులు, నొప్పులతో తెగ బాధపడుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య పెరిగితే కీళ్ల వాపులు, నొప్పులు వస్తాయి. మన కిడ్నీలు సరిగ్గా పని చేయనప్పుడు కీళ్ల చుట్టూ చిన్న స్పటికాల రూపంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. దీని కారణంగా కీళ్ల నొప్పులు, వాపులు, నడవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేసే వంటింటి చిట్కాలు
అయితే అందుకోసం శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయి పెరగకుండా నియంత్రించడం ఎంతో అవసరం. శరీరంలో యూరిక్ యాసిడ్ ను నియంత్రించడానికి కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి. మన వంటింట్లో దొరికే వివిధ మసాలాలతోనే యూరిక్ యాసిడ్ ను తగ్గించుకోవచ్చు.

home remedies to cure uric acid problems arthritis and swellings

అల్లంతో యూరిక్ యాసిడ్ కు చెక్
యూరిక్ యాసిడ్ తగ్గించడానికి అల్లం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అల్లం లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరం నుంచి యూరిక్ యాసిడ్ ను తొలగించడంలో సహాయపడతాయి. అల్లాన్ని డైరెక్ట్ గా తీసుకున్నా, అల్లం టీ చేసుకుని రోజుకు రెండుసార్లు తాగినా యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది.

పసుపుతోనూ యూరిక్ యాసిడ్ సమస్యకు పరిష్కారం
ఇక యూరిక్ యాసిడ్ సమస్య తగ్గడానికి పసుపు ఎంత దోహదం చేస్తుంది. పసుపుతో వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా నుంచి ఉపశమనం కలుగుతుంది. పసుపులో ఉండే శక్తివంతమైన కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మన శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి దోహదం చేస్తుంది. దీనితో కీళ్లనొప్పులు, వాపులు నుండి ఉపశమనం లభిస్తుంది.

మెంతులు కూడా యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు బెస్ట్
మెంతులలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు యూరిక్ యాసిడ్ ను తగ్గించి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మెంతులను డైరెక్ట్ గా తీసుకున్న లేక రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీళ్లు తాగిన యూరిక్ యాసిడ్ కంట్రోల్ అవుతుంది.

జీలకర్రతో యూరిక్ యాసిడ్ కు చెక్
ఇక జీలకర్ర కూడా యూరిక్ యాసిడ్ ను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల అందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యూరిక్ యాసిడ్ ని తగ్గించడంతోపాటు కీళ్ళ నొప్పులు వాపులను కూడా తగ్గిస్తాయి. ఇది మాత్రమే కాకుండా కీళ్ల నొప్పులు, వాపులు తగ్గాలంటే, యూరిక్ యాసిడ్ అదుపులోకి రావాలి అంటే ఎక్కువగా నీటిని తాగాలి.

యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఇవి కూడా పాటించాలి
నీళ్ళను ఎక్కువగా తాగటం వలన మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి యూరిక్ ఆసిడ్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును కంట్రోల్లో ఉంచుకోవడం కూడా యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ చేస్తుంది. వేపుళ్ళు, డీప్ ఫ్రై లు మసాలా ఫుడ్స్ తినటం తగ్గిస్తే కూడా యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+