ఉలవల వలన కలిగే ప్రయోజనాలతో మీ ఆరోగ్యం రేసుగుర్రం
ఉలవలు.. మనకు ఎన్నో పోషకాలను ఇచ్చే, మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేసే గింజ ధాన్యాలలో ఉలవలు ఒకటి. ఉలవలలో ఉండే ప్రయోజనాలు మరే ఆహార పదార్థాలలోను ఉండవు అంటే నమ్మి తీరాల్సిందే. అయితే ఉలవలు మనకు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలను చూడండి.
ఉలవలతో ఆరోగ్యం
ఉలవలు రుచికే కాదు ఆరోగ్యానికి చాలా మంచిది. ఉలవల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి.ఉలవల్లో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పీచుపదార్థం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉలవల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఊబకాయం సమస్య ఉన్నవారు ఉలవలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది
అయితే వీరు ఉలవలను ఎలా ఆహారంలో చేర్చుకోవాలి అంటే ఉలవలను ఉడకబెట్టిన నీటిని చారుగా కాచి, ఉలవచారుని తీసుకుంటే చాలా మంచిది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీంతో క్రమ క్రమంగా ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు. లావుగా ఉన్నవాళ్ళు బ్రేక్ ఫాస్ట్ లో ఉలవ పచ్చడి చేసుకొనే తింటే సన్నబడిపోతారు. ఉలవ పచ్చడి తినే వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మరింత రిజల్ట్ కనిపిస్తుంది.
రక్త హీనతకు ఉలవలు బెస్ట్
క్రమం తప్పకుండా పీరియడ్స్ రాని మహిళలలు ఎనిమిది గంటలు నానబెట్టిన ఉలవలు తినడం వలన ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఉలవలు తీసుకునే సమయాల్లో మంచి నీరు ఎక్కువగా తాగాలి. రక్తహీనతతో బాధపడేవారు తొందరగా అలసటకు గురవుతారు.ఎప్పుడు నీరసంగా ఉంటారు మామూలు ఆహారంతో సరైన పోషకాలు అందక ఎప్పుడూ బలహీనంగా కనబడుతుంటారు. వారిలో చూపు మందగిస్తుంది ,జ్ఞాపక శక్తి కోల్పోతారు. ఇలాంటివారికి మంచి ఆహారం ఉలవలు అని చెప్పొచ్చు.
ఈ సమస్యలకు ఉలవలతో చెక్
ఉలవలు మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. ఉలవలు రక్త నాళాలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ని కరిగించడంలో సహాయపడతాయి.ఉలవలు జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి. ఆకలిని పెంచుతాయి.ఉలవలు కఫాన్ని తగ్గిస్తాయి. చర్మ సమస్యల నివారణలో, కీళ్ళ నొప్పుల నివారణలో బాగా పని చేస్తాయి.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications