హాట్ వాటర్, కూల్ వాటర్.. మీ ఆరోగ్యానికి ఏ నీరు తాగితే మంచిది!!

మానవ జీవనానికి ఆధారం నీళ్లు. మనిషి నీళ్లు తాగకుంటే బ్రతకడం కష్టం. నీరు మన ఆరోగ్యాన్ని కాపాడడానికి, విధులు సక్రమంగా జరగడానికి కీలకపాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే గొప్పలక్షణం నీటికి ఉంది. మన శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. పోషకాల శోషణకు మద్దతుని ఇస్తుంది. శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి, మన శరీరంలోని అవయవాలు, కణజాలాలను ఆరోగ్యంగా ఉంచడానికి నీరు దోహదం చేస్తుంది.

అయితే ఇక నీటిని తాగే విషయంలో కొంతమంది చల్లటి నీళ్లను తాగడానికి ఇష్ట పడతారు. కొందరు వేడి నీటిని తాగడానికి ఇష్టపడతారు. అయితే మనం తాగే నీళ్ల యొక్క ఉష్ణోగ్రత మన వ్యక్తిగత ఆసక్తిని బట్టి, నిర్దిష్ట వాతావరణ పరిస్థితులను బట్టి మారవచ్చు. అయితే బాగా వేడి నీళ్లను, విపరీతంగా కూల్ వాటర్ ను కూడా తాగకూడదు.

Hot water, cool water.. which is better for your health?

అసలు మనం నీళ్లను తాగేటప్పుడు ఎటువంటి నీళ్లను తాగాలి? వేడి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి? చల్లటి నీళ్లను తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.వేడి నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వేడినీరు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. మన శరీరం నుండి టాక్సిన్లను బయటకు పంపుతుంది.

మన శారీరక బరువు తగ్గడానికి వేడి నీళ్లు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. వేడి నీళ్లను తాగడం వల్ల జలుబు తగ్గుతుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బహిష్టు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇక చల్లటి నీటిని తాగడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అతి చల్లని నీటిని తాగడం మంచిది కాదు.

చల్లటి నీటిని తాగడం వల్ల శారీరక శ్రమ ఎక్కువగా చేసిన వారి శరీర ఉష్ణోగ్రత చల్లబడుతుంది. వారి పనితీరు మెరుగుపడుతుంది. అథ్లెటిక్ ల పనితీరు మెరుగుపడుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల కండరాల నొప్పి, వాపు తగ్గుతుంది. తీవ్రమైన శారీరక వ్యాయామం తర్వాత చల్లటి నీళ్లను తాగడం మంచిది. చల్లటి నీళ్లను తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది.

చల్లటి నీరు కూడా బరువు తగ్గించే ప్రయత్నాలకు మద్దతు నిస్తుంది. చల్లటి నీళ్లు శరీరాన్ని మనసును రిఫ్రెష్ చేస్తుంది. ఇది చురుకుదనాన్ని, ఏకాగ్రతను, మానసిక పనితీరును పెంచుతుంది. వడదెబ్బ నుండి ఉపశమనం కలిగిస్తుంది. చల్లటి నీరు తల మరియు మెడ ప్రాంతంలో రక్తనాళాలకు రిలీఫ్ నిస్తుంది.

మైగ్రేన్, టెన్షన్ తలనొప్పిని తగ్గిస్తుంది. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. కాబట్టి వేడి నీళ్లు అయినా, చల్లటి నీళ్లయినా తాగిన వారికి మేలునే చేస్తాయి. కాకుంటే అతి సర్వత్ర వర్జయేత్ తన విషయాన్ని గుర్తుపెట్టుకుని అధిక వేడి, అతి శీతల నీటిని తీసుకోకుండా ఉంటేనే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+