గుమ్మడి గింజలు తింటే ఆరోగ్యం ఎలా మారుతుంది?
ఇటీవల కాలంలో చాలా మంది ఆరోగ్యంగా ఉండడం కోసం ఆహారం పైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా నట్స్, సీడ్స్ తింటూ శరీరానికి కావలసిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇక అటువంటి పౌష్టికాహారంలో గుమ్మడి గింజలు ఒకటి. గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్ విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి తో పాటు బోలెడు పోషకాలు ఉంటాయి.
గుమ్మడి గింజలతో ఆరోగ్యం
ఐరన్, కాల్షియం, జింక్ ,ఫోలేట్, ఫ్యాటీ ఆసిడ్స్, ఫాస్ఫరస్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు గుమ్మడి గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్ తో పాటు, యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. తరచూ గుమ్మడి గింజలను ఆహారంలో భాగంగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

గుమ్మడి గింజలతో ఈ సమస్యకు చెక్
గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సంబంధితమైన సమస్యలు తగ్గుతాయి. అధిక బరువుతో బాధపడేవారు రోజు ఒక చెంచా గుమ్మడి గింజలు తింటే పొట్ట నిండిన భావన కలగడంతో ఎక్కువగా ఆహారం తీసుకోకుండా ఉంటారు. దీని వల్ల బరువు తగ్గుతారు. గుమ్మడి గింజలు అతిగా ఆహారం తినే అలవాటును నియంత్రించి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
గుమ్మడి గింజలతో డయాబెటిస్ కంట్రోల్
ఇక గుమ్మడి గింజల్లో ఉండే కెరోటినాయిడ్ లు, విటమిన్ ఈ ,యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. కాన్సర్ రాకుండా చేస్తాయి. గుమ్మడి గింజల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గుతాయి. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్ మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మన మెదడుపై ఒత్తిడి తగ్గించేందుకు దోహదం చేస్తుంది.
బీపీ కంట్రోల్, గుండె ఆరోగ్యానికి గుమ్మడి గింజలు
ముఖ్యంగా గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం బిపిని నియంత్రిస్తుంది. గుండెకు రక్షణగా ఉంటుంది. జింక్ శరీరంలోని విటమిన్ లను ఖనిజాలను గ్రహించడంలో ఎంతో బాగా సహాయపడుతుంది. ఇక గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి క్రమబద్దీకరించబడుతుంది. మన శరీరానికి కావలసిన ప్రోటీన్ తగినంతగా లభించడం కారణంగా కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
మంచి నిద్రకు గుమ్మడి గింజలు
గుమ్మడి గింజలలో ఉండే పోషకాలు మెలటోనిన్ ఉత్పత్తిని పెంచి మనకు మంచి నిద్ర వచ్చేలా చేస్తాయి. గుమ్మడి గింజలతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది .ప్రతిరోజు చెంచాడు గుమ్మడి గింజలను తీసుకుంటే జుట్టు దృఢంగా ఉంటుంది. చుండ్రు సమస్య కూడా నివారించబడుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications