పుచ్చ గింజలు పారేస్తున్నారా? ఇవి తెలిస్తే తెచ్చుకుని మరీ తింటారు!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇటీవల ఆరోగ్యం పైన చాలామందికి అవేర్నెస్ వచ్చింది. ఈ క్రమంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? అనేది తెలుసుకొని మరీ జాగ్రత్త పడుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు, శరీరానికి అన్ని పోషకాలు అందాలని భావించేవారు కొన్ని రకాల గింజలను తింటే ప్రయోజనం ఉంటుందని గుర్తించారు. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ ఇలా రకరకాల గింజలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని గుర్తించారు.

పుచ్చ గింజల్లో పోషకాలు ఫుల్
ఇక గింజలలో విశేషమైన పోషకాలు ఉన్న పుచ్చగింజలు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
చాలామంది పుచ్చకాయలను తిని పుచ్చగింజలను మాత్రం పారేస్తారు. అయితే పుచ్చగింజల్లో బోలెడు పోషకాలు ఉంటాయని అవి మనకు కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాయని తెలుసుకోవలసిన అవసరం ఉంది. పుచ్చకాయ గింజల్లో విటమిన్లతో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి.

How does eating water melom seeds change health what is the health benefits of watermelon seeds

పుచ్చ గింజలతో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు
పుచ్చగింజలలో ఉండే అమైనో యాసిడ్ లు రక్తనాళాలను వెడల్పు చేసి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. పుచ్చ గింజలు మనకు గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తాయి. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయి. పుచ్చగింజల్లో ఉండే మోనోసాచ్యురేటెడ్, పాలి అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

పుచ్చ గింజలతో పురుషులలో వీర్య కణాల వృద్ధి
పుచ్చగింజలలో ఉండే లైకోపీన్ పురుషులలో వీర్యకణాల అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. పుచ్చ గింజలు స్పెర్ము కౌంటును పెంచి, స్పెర్ము నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి. పురుషుల సంతాన ఉత్పత్తికి ఇవి ఎంతగానో దోహదం చేస్తుంది. పుచ్చ గింజలను ఆహారంలో భాగంగా చేసుకుంటే కండరాలు బలోపేతం అవుతాయి. ఇవి కండరాల నొప్పులను గణనీయంగా తగ్గిస్తాయి. పుచ్చ గింజలు మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

బరువు తగ్గేందుకు పుచ్చ గింజలు
మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. మన జ్ఞాపక శక్తిని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి పుచ్చ గింజలు ఎంతగానో దోహదం చేస్తాయి. బరువు తగ్గడానికి కూడా పుచ్చ గింజలు దోహదం చేస్తాయి. పుచ్చగింజలలో లభించే మెగ్నీషియం జీవక్రియకు సంబంధించిన శక్తి ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషించి మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. పుచ్చ గింజలలో చాలా తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పోషకాహారం అని చెప్పాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+