ఈ చిన్న చిట్కాలతో సులువుగా బరువు తగ్గుతారు
మనమే కాకుండా మన చుట్టూ ఉన్నవారు కూడా ఎప్పుడూ స్లిమ్ గా కనపడాలని కోరుకుంటుంటారు. మనిషి బరువు తగ్గడమనేది చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారిపోయింది. కఠినమైన ఆహార నియమాలతోపాటు భారీగా వ్యాయామాలు చేస్తుండాలి. మనలో ఉన్న కొన్ని చెడు అలవాట్లు కూడా బరువు పెరగడానికి కారణమవుతాయి.
నూనెలో వేయించిన పదార్థాలు, తీపి పదార్థాలు తినడం, శారీరకంగా ఎటువంటి శ్రమ ఉండకపోవడంతో సులువుగా బరువు పెరుగుతున్నారు. అయితే కొన్ని అలవాట్లను పాటిస్తే సులవుగా బరువు తగ్గడంతోపాటు మనల్ని ఎంతో ఇబ్బందిపెట్టే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది. ఆ అలవాట్లు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉదయాన్నే వేడినీళ్లు తాగాలి
ప్రతిరోజు ఉదయంపూట నిద్ర లేవగానే వేడినీళ్లు తాగడంవల్ల బరువు తగ్గుతారు. దీనివల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. జీవక్రియ మెరుగవడంతోపాటు ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. రోజూ 2 కప్పుల గోరువెచ్చని నీటిని తాగితే శరీరం ఎప్పుడూ శక్తివంతంగా ఉంటుంది. తేనెతో కలిపిన గోరువెచ్చని నీటిని కూడా తాగొచ్చు.

2. ఆరోగ్యమైన అల్పాహారం
బరువు తగ్గాలంటే రోజులో మొదటి భోజనంతోనే ప్రారంభించాలి. ఆరోగ్యాన్నిచ్చేవి మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండేవి తీసుకోవాలి. గుడ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్, మొలకలు, పండ్లు, పండ్ల రసాలు, కూరగాయల రసాలను చేర్చవచ్చు.
3. తప్పనిసరిగా వ్యాయామం చేయాలి
ఉదయం నిద్ర లేచిన తర్వాత వాకింగ్, జాగింగ్, యోగా, జిమ్ లో చెమటలు కక్కడంలాంటివి చేయాలి. దీనివల్ల బరువు సులభగా తగ్గుతారు. జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
4. శరీరానికి నీటికొరత రాకుండా చూడటం
శరీరంలో నీటికొరత ఏర్పడితే మన జీవక్రియపై ప్రభావం పడుతుంది. మనిషి శరీరంలో ఎక్కువ భాగం నీటితోనే తయారవుతుంది. శరీరం హైడ్రేట్ గా ఉండకపోతే శరీన పనితీరులో సమస్యలు తలెత్తుతాయి. బరువు తగ్గడం కూడా సులభంగా జరగదు.












Click it and Unblock the Notifications