తాటి ముంజలు తింటే భలే ఆరోగ్య ప్రయోజనాలు.. అసలే వదిలిపెట్టరు!
సమ్మర్ సీజన్లో దొరికే తాటి ముంజల వలన బోలెడు ఉపయోగాలు ఉంటాయి. తాటి ముంజలు చూడటానికి జెల్లీలా, మృదువుగా ఉంటాయి. ఏప్రిల్ నెల నుండి మొదలుకొని మే నెల చివరి వరకు తాటి ముంజలు మనకు పుష్కలంగా దొరుకుతాయి . ఎలాంటి కల్తీలేని పకృతి వరప్రసాదాయిని ఏదైనా ఉంది అంటే అది తాటి ముంజలే.
తాటి ముంజలు తినడం వలన మీ కడుపు త్వరగా చల్లబడుతుంది
తాటి ముంజలలో మన శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి. ఎండాకాలంలో చెమటతో త్వరగా డిహైడ్రేషన్ అయ్యేవారికి తాటి ముంజలు శరీరం హైడ్రేట్ అయ్యేలా చేస్తాయి. వర్క్ రీత్యా ఎక్కువగా బయట గడిపేవారు రోజుకు బాడీకి సరిపోయేంత మంచి నీరు తాగకపోవడం వలన కిడ్నీలలో రాళ్ళు ఏర్పడతాయి. ఈ సమస్య ఉన్నవాళ్ళకు కూడా తాటి ముంజలు దివ్యౌషధం.

తాటి ముంజలతో బరువుకు చెక్
కడుపులో మంట, మూత్ర విసర్జన సమయంలో పొత్తికడుపులో భరించలేని నొప్పితో బాద పడేవారు క్రమం తప్పకుండా ఒక పదిహేను రోజులు పాటు లేత ముంజలను తినాలి. ఇక తాటి ముంజలలో శరీరానికి కావాల్సిన ఏ, బీ, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్పరస్, పొటాషియంవంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తాటి ముంజలు మన శరీర బరువు తగ్గటానికి ఎంతగానో దోహదం చేస్తాయి.
తాటి ముంజలతో శరీరానికి శక్తి
తాటి ముంజలు కాలేయ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. ఈ ముంజలలో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విష పదార్ధాలను తొలగిస్తుంది. తాటి ముంజలు మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చి అలసటను తగ్గిస్తాయి. ఇక ఎండాకాలంలో చాలా వేడి చేసి ఇబ్బంది పడే వారు తాటి ముంజలను తింటే శరీరం చల్లబడుతుంది. శరీరానికి చలువ చేకూర్చే తాటి ముంజలను ఐస్ యాపిల్ అని కూడా పిలుస్తారు.
తాటి ముంజలు సమ్మర్ లో చాలా అవసరం
తాటి ముంజలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. శరీరానికి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వేసవి కాలంలో మన శరీరం నుండి చెమట బయటకు పోతుంది. శరీరంలోని పోషకాలు చెమట రూపంలో బయటకు పోతాయి. వాటిని భర్తీ చేయటానికి తాటి ముంజలు ఎంతో అవసరం.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications