ఈ పండ్లు తింటే శృంగారంలో మీరే మన్మధులు

సమాజంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, విపరీతంగా పెరిగిన పని ఒత్తిడి కారణంగా చాలా మంది పురుషుల్లో సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. స్పెర్ము కౌంట్ కూడా పడిపోతుంది. ఫలితంగా సంతాన లేమి సమస్య సమాజంలో తీవ్రంగా పెరిగిపోతుంది. పురుషులలో సెక్స్ సామర్ధ్యం తగ్గటం వారిని ఆత్మన్యూనతా భావానికి గురి చేస్తుంది. ఇతర మానసిక సమస్యలకు కారణం అవుతుంది.

పండ్లతో సెక్స్ సామర్ధ్యం పెంపు
అయితే పురుషులు ఉన్న లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి ఆహారం ఎంతో ఉపయోగపడుతుందని, లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇక లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహారాలలో పండ్లు కీలకమైన పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావించే పురుషులు మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకోవాలని, ప్రతిరోజు ఒకటి, రెండు పండ్లను తింటే వారిలో క్రమంగా సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని చెబుతున్నారు.

If you eat these fruits you will be the king of sex and romance

ఈ పండ్లను తింటే శృంగార సమస్యలకు చెక్
శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనుకునేవారు పుచ్చ కాయలను తినడం మంచిదని, పుచ్చ కాయలను ఎల్ సిట్రైన్ అధికంగా ఉండడం వల్ల అది సెక్స్ సామర్ధ్యాన్ని మరింత పెంచుతుందని చెబుతున్నారు. అరటి పండ్లు కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి కీలకంగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. అరటి పండులో అధికంగా ఉండే పొటాషియం లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు.

సెక్స్ సామర్థ్యాన్ని పెంచడంలో ఈ పండ్లు కీలకం
ద్రాక్షపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని, అవి లైంగిక అవయవాలకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు. సెక్స్ సామర్థ్యాన్ని పెంచడంలో అంజీర పండ్లు బాగా పనిచేస్తాయని అవి పురుషులకు నూతన ఉత్సాహాన్ని ఇస్తాయని చెబుతున్నారు. అయితే అంజీర పండ్లతో పాటు బాదం, ఖర్జూరం వంటి పండ్లను కూడా తినడం మంచిదని చెబుతున్నారు.

లైంగిక సామర్ధ్యం పెంచుకునేందుకు పండ్లు
అవకాడో, దానిమ్మ లను తినడం వల్ల కూడా లైంగిక సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఒక క్రమ పద్ధతిలో ప్రతిరోజు ఆహారంలో పండ్లను భాగంగా చేసుకుని, రోజు రెండు పండ్లను తిన్నట్లయితే శృంగార సామర్థ్యం క్రమంగా పెరుగుతుంది. నిత్యం ఇలా పండ్లను తింటూ ప్రయత్నం చేస్తే కొద్దిరోజుల్లో మార్పును మీరే చూడొచ్చు. ఇక శృంగారంలో మీరే మహరాజులు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+