ముద్దు చేసే మహిమ తెలిస్తే ముద్దు లేకుండా ఉండలేరు!

ముద్దు చేసే మహిమ అంతా ఇంతా కాదు. ముద్దుతో ఆరోగ్యం మాత్రమే కాదు అందం , ఆనందం కూడా కలుగుతాయి. ముద్దు జీవిత భాగస్వామిపై ప్రేమను వ్యక్తం చేయడానికి, ప్రేమికులు ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేయడానికి ఉపయోగించే ఒక మార్గం. ఎవరి పైన అయినా ప్రేమను వ్యక్తం చేయటానికి చుంబనమే మార్గం. అధర చుంబనాన్ని ప్రతీ ఒక్కరూ వారి ప్రేమకు సంకేతంగా చెప్పవచ్చు.

ముద్దుతో ఆరోగ్య ప్రయోజనాలు
అటువంటి ముద్దు తోటి ఆనందమే కాదు ఆరోగ్యం కూడా అని చెబుతున్నారు వైద్యులు. ఇష్టమైన వారు ఇచ్చే ముద్దుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
ముద్దుతో ముఖంలోని కండరాలు అన్నింటికీ వ్యాయామం లభిస్తుంది. ముద్దు పెట్టడం వల్ల మన ముఖానికి మంచి ఆకృతి వస్తుంది. ముద్దు వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. ముఖంపై ముడతలు తొందరగా రావు.

If you know the glory of kissing on health you can t stop kissing

ముద్దుతో బీపీకి చెక్
అంతేకాదు ముద్దు రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గించటానికి ఉపయోగపడుతుంది. హై బి.పి ఉన్నవారికి ముద్దు పెడితే వారి బిపి కాస్త తగ్గుతుంది. శరీరంలోని నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి ముద్దు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.ముద్దు పెట్టటం వలన తల నొప్పి, తిమ్మిర్లు, రుతుస్రావం ఈ సమయంలో నొప్పులు తగ్గుతాయి.

ముద్దు వల్ల హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి
ముద్దు పెడుతున్నప్పుడు మన శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఆక్సిటోసిన్, డోపమైన్ వంటి రసాయనాలు విడుదలై మానసిక ఆందోళనను దూరం చేస్తాయి. మానసికంగా డిప్రెషన్లో ఉన్నవారికి కూడా ముద్దు మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. ముద్దు మనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు విడుదలయ్యే లాలాజలం మన పళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పళ్ళు పాడు కాకుండా చేస్తుంది.

ముద్దు ఒక మంచి వ్యాయామం
ఒక్కమాటలో చెప్పాలంటే ముద్దు కూడా వ్యాయామమే. ముద్దు పెట్టుకోవడం వల్ల ఒక్క చుంబనంతో శరీరంలో 8 నుండి 16 కేలరీల శక్తి వినియోగించబడుతుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల లైంగిక ఆసక్తి బాగా పెరిగి శృంగారంలో కూడా ఉత్తేజంగా పాల్గొనే వీలుంటుంది. దీనివల్ల ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. మనకు ఎంతో మేలు చేసే ముద్దును కచ్చితంగా ముద్దు చేసి, ఇష్టమైన వారికి ఇచ్చి వారి ఆరోగ్యాన్ని, తిరిగి తీసుకుని మీరు ఆనందాన్ని పొందండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+