మెంతికూర గొప్పతనం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో మెంతులు మాత్రమే కాదు మెంతికూర కూడా కీలక భూమిక పోషిస్తుంది. మన ఆహారంలో భాగంగా మెంతుకూరని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మెంతులు మన ఆరోగ్యానికి ఏ విధంగా అయితే దోహదం చేస్తాయో మెంతికూర కూడా అంతకు మించిన ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇక మెంతికూరతో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
మెంతికూరతోనూ ఆరోగ్య ప్రయోజనాలు
మెంతికూర యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. మెంతికూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. మెంతి ఆకుల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన పోషకాలని ఇచ్చి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇక మెంతి గింజలు వాటి ఆకులను అనేక అనారోగ్య సమస్యలకు మందులుగా ఉపయోగించవచ్చని పరిశోధనలలో వెల్లడైంది.

మెంతికూరతో చెడు కొలెస్ట్రాల్ కు చెక్
మెంతి ఆకులను ఉపయోగించడం టైప్ వన్, టైప్ టు డయాబెటిస్ తో సంబంధం ఉన్న లక్షణాలను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మెంతి మన శరీరాన్ని కాపాడుతుంది. మెంతికూర మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీ వైరల్ లక్షణాలు అనేక నొప్పులు, వాపులకు బాగా పనిచేస్తాయి.
లైంగిక సామర్ధ్యాన్ని పెంచే మెంతికూర
మెంతికూర లైంగిక సమర్థతను కూడా గణనీయంగా మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, పేగు సంబంధిత ఆరోగ్య సమస్యలు, మూత్రపిండాల వ్యాధి, కాలిన గాయాలు, వంధ్యత్వం ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో మెంతికూర బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు మన ఆహారంలో మెంతులను లేదా మెంతికూరను భాగంగా చేసుకుంటే మేలు జరుగుతుంది.
బీపీ, గుండె పోటు నియంత్రించే మెంతికూర
మెంతికూరలో ఉండే పోషకాలు గుండెకు మేలు చేస్తాయి. మెంతికూరలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంతోపాటు, కంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మెంతికూరలో విటమిన్ కే అధిక పరిమాణంలో ఉండడం వల్ల దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మెంతికూర తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
జుట్టు, చర్మ ఆరోగ్యానికి మెంతికూర
మెంతికూరతో రక్తం శుద్ధి చేయబడుతుంది. మన జుట్టును, చర్మ ఆరోగ్యాన్ని మెంతికూర సురక్షితంగా ఉంచుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న మెంతుకూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. అయితే అతిగా తినడం అనర్ధాలకు దారితీస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మెంతికూరను తినే విషయంలో తగిన మోతాదులోనే తీసుకోవడం మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications