వెల్లుల్లి చేసే ఆరోగ్య అద్భుతాలు తెలిస్తే రోజూ తింటారు!
వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో వెల్లుల్లి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చలికాలంలో మనకు త్వరగా అనారోగ్య సమస్యలు వస్తాయి. రకరకాల ఇన్ఫెక్షన్లు మనలను ఇబ్బంది పెడతాయి. అయితే చలికాలంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు వెల్లుల్లి మంచి పరిష్కారాన్ని చూపిస్తుంది. వెల్లుల్లి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
వెల్లుల్లితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
వెల్లుల్లిలోని అలిసిన్ అనే యాంటీ బ్యాక్టీరియల్ కాంపోనెంట్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. వెల్లుల్లి తింటే మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. వెల్లుల్లిలో అలిసిన్ ఉండడం వల్ల ఇది మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతీరోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను ఉదయాన్నే తినేవారు గుండె పోటుకు గురి కారు.

వెల్లుల్లితో బీపీ, కొలెస్ట్రాల్ లకు చెక్
వెల్లుల్లిలో కర్కుమిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడుతుంది. వెల్లుల్లి మన బీపీని కూడా కంట్రోల్ చేసి కొలెస్ట్రాల్ స్థాయిలను నార్మల్ గా ఉండేలా చేస్తుంది. వెల్లుల్లితో ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది. ఇది మన కీళ్లనొప్పుల నివారణకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో ఉండే గుణాలు మన శరీరంలో ప్రీ రాడికల్స్ తో పోరాడతాయి.
వెల్లుల్లితో ట్రైగ్లిజరైడ్స్ కు చెక్
వెల్లుల్లి ఊపిరితిత్తులకు మంచి చేస్తుంది. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉన్నవారికి వెల్లుల్లి ఎంతో బాగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ b6, మాంగనీస్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి మన శరీర ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. వెల్లుల్లి మన రక్తంలోని ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గిస్తాయి. వెల్లుల్లిని మూడు రోజులపాటు తేనెలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం 3 వెల్లుల్లి రెబ్బలను తింటే ట్రైగ్లిజరైడ్స్ బాగా తగ్గుతాయని చెబుతారు.
వెల్లుల్లి మితంగా రోజూ తీసుకుంటేనే ఫలితం
ఇక మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే వెల్లుల్లి ప్రతిరోజు తీసుకోవడం మంచిది. అయితే వెల్లుల్లి అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం జీర్ణక్రియ సమస్యలు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెల్లుల్లిని పరిమితంగా ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో తీసుకోవడం మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications