బరువును తగ్గించే ఈ జ్యూస్ లతో స్లిమ్ పక్కా!

ప్రస్తుత సమాజంలో మన జీవన శైలి విధానంతోను, ఆహారపు అలవాట్లతోనూ ఎక్కువ మంది ఒబేసిటీ బారిన పడుతున్నారు. అయితే ఒబేసిటీ నుంచి బయటపడటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒబేసిటీ బారిన పడిన వారికి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్న క్రమంలో బరువు తగ్గటానికి దోహదం చేసే ఆహారంపైన జ్యూస్ ల పైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు.

బరువు తగ్గాలంటే తాగాల్సినవి ఇవే
ఇక ఈరోజు మనం బరువు తగ్గడానికి ఉపయోగపడే కొన్ని రకాల జ్యూస్ ల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. బాగా బరువు తగ్గాలని భావించేవారు తీపి పదార్థాలను, చక్కెరతో కలిపిన పండ్ల రసాలను తీసుకోకూడదు. బరువు తగ్గాలనుకునేవారు మనం నిత్యం తినే కూరగాయలలో కొన్ని కూరగాయలను జ్యూస్ గా చేసుకుని తాగితే ఈజీగా బరువు తగ్గుతాము.

If you try these juices that reduce weight you will be slim

కీరా దోస జ్యూస్
బరువు తగ్గేందుకు కీరదోస ఎంతగానో దోహదం చేస్తుంది. కీరా దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. కీరా దోసలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల ఇది మన బరువును కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది.

టమాటా జ్యూస్
బరువు తగ్గాలనుకునేవారు టమాటా జ్యూస్ ను తాగడం చాలా మంచిది. టమాటాలలో విటమిన్ సి, విటమిన్ ఈ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు టమాటా జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

కాకరకాయ జ్యూస్
బరువు తగ్గాలని భావించేవారు కాకరకాయ జ్యూస్ ను పరగడుపున తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. అంతేకాకుండా కాకరకాయ జ్యూస్ తో శరీరంలో అదనంగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. కాకరకాయ జ్యూస్ తో ఇంకా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

సొరకాయ జ్యూస్
బరువు తగ్గాలని భావించేవారు సొరకాయ జ్యూస్ ను తాగడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుంది . సొరకాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సొరకాయ మన శరీరానికి కావలసిన ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా అందించి బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.

బీట్ రూట్, క్యారెట్ జ్యూస్
బరువు తగ్గాలంటే బీట్ రూట్ జ్యూస్ ని తాగినా మంచిదే.. బీట్ రూట్ లో విటమిన్ సి, విటమిన్ కే ఎక్కువగా ఉండటం వల్ల బీట్ రూట్ జ్యూస్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఇక క్యారెట్ జ్యూస్ కూడా బరువును నియంత్రించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్ జ్యూస్ లో బీటా కెరోటిన్ ఉండటం వల్ల ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పాలకూర, బచ్చలికూరలతో జ్యూస్
క్యారెట్ జ్యూస్ పోషకాలతో పాటు పీచు పుష్కలంగా ఉండడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇక బరువు తగ్గాలని భావించేవారు పాలకూర, బచ్చలి కూర వంటి వాటిని జ్యూస్ గా, స్మూతీలుగా చేసుకుని తాగడం మంచిది. వీటిలో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+