అందంతో పాటు ఆరోగ్యం కావాలంటే ఈ జ్యూస్ తాగండి!
సహజంగా ఆకుకూరల్లో లభించే పోషకాలు, మిటమిన్లు ఇతర ఏ కూరగాయల్లోనూ అంతగా లభించవు. ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి మంచిది అని డాక్టర్లు చెబుతుంటారు..మరి అవే ఆకు కూరలను జ్యూస్ చేసుకొని తాగితే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఆకుకూరలలో పాలకూరకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. పాలకూర పుష్కలంగా పోషకాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.
పాలకూర జ్యూస్ తో ఈ సమస్యలకు చెక్
పాలకూరను జ్యూస్ చేసుకొని తాగడం వలన మనకు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు కావలసినన్ని లభిస్తాయి.. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడతాయి ,చర్మం పొడిబారకుండా ,ముడతలు రాకుండా కాపాడతాయి. పాలకూరలో మిటమిన్ ఏ కంటి చూపు సమస్య ఉన్నవారికి, రే చీకటితో బాధపడేవారికి ఉపయోగపడుతుంది . కాబట్టి పాలకూర జ్యూస్ తాగడం వలన ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

పాలకూర జ్యూస్ తో హైబీపీ నియంత్రణ
పుట్టిన పసి పిల్లలకు పాలిచ్చే తల్లులకు పాల ఉత్పత్తి పెరగడం కోసం పాలకూర జ్యూస్ తాగితే ప్రయోజనం ఉంటుంది. పాలకూర జ్యూస్ వలన పాల ఉత్పత్తి పెరుగుతుంది..
పాలకూర జ్యూస్ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందడమే కాకుండా రక్తపోటు సమస్యతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. పాలకూరలో పొటాషియం, మెగ్నీషియం , ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి . ఇది హైపర్ టెన్షన్ ను తగ్గిస్తుంది
గుండె ఆరోగ్యానికి పాలకూర జ్యూస్
మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని అరికడుతుంది. కాలేయ వ్యాధులను దూరం చేస్తుంది. మలబద్దక సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.పాలకూర జ్యూస్ ను డైలీ కాకపోయిన్ వారంలో ఒకటి రెండు సార్లు తాగితే క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్త పడొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. పాలకూర జ్యూస్ తాగటం గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తి కలిగిస్తుంది.
పాలకూర జ్యూస్ తో అందం, ఆరోగ్యం
పాలకూర జ్యూస్ తో చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టుకు బలం చేకూరుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. పాలకూర జ్యూస్ మన చర్మం ముడతలు రాకుండా చేస్తుంది.అందం, ఆరోగ్యం రెండింటినీ ఇచ్చే పాలకూరను జ్యూస్ రూపంలోనూ, స్మూతీ రూపంలోనూ చేసుకుని తీసుకుంటే మంచిది.












Click it and Unblock the Notifications