నిల్వ పచ్చళ్ళు తెగ తినేవారికి ముఖ్యమైన వార్త!
చాలామంది పచ్చళ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. కూరలు ఉన్నప్పటికీ పచ్చళ్ళని ఎక్కువగా పెట్టుకుని భోజనం చేస్తారు. కూర లేకపోయినా పర్వాలేదు పచ్చడి ఉంటే చాలు అనుకుని ఫీలయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది నిలువ పచ్చళ్ళు అయినటువంటి మామిడి, ఉసిరి ,నిమ్మ ,టమాట, ఇలా రకరకాల పచ్చళ్ళు పెడతారు.
నిల్వ పచ్చళ్ళతో ప్రమాదం
ఏడాది పాటు నిల్వ ఉండేలా వాటిల్లో ఉప్పు కారం నూనెలను ఫుల్లుగా దట్టించి ప్రిపేర్ చేసి నిల్వ చేస్తారు. ఇక నిలువ పచ్చళ్లను ఎక్కువగా తినేవారు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. నిలువ పచ్చళ్ళు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునేవారు పచ్చళ్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. నిలువ పచ్చళ్ళలో పోషకాలు తక్కువగా ఉంటాయని అవి ఏమాత్రం ఆరోగ్యం కాదని సూచిస్తున్నారు.

నిల్వ పచ్చళ్ళు తింటే జరిగేదిదే
ప్రతిరోజు నిలువ పచ్చళ్ళు తింటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిలువ పచ్చళ్ళు ఎక్కువగా తినేవారిలో కడుపులో మంట, ఎసిడిటీ సమస్య వస్తుందని చెబుతున్నారు. కూరగాయలు ఆకుకూరలతో చేసిన కూరలతో పోలిస్తే పచ్చళ్ళు తినడం చాలా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు. ఇక పచ్చళ్ళు అతిగా తింటే మీ ఆరోగ్యం కచ్చితంగా డేంజర్ లో పడుతుందని తేల్చి చెబుతున్నారు.
ఊరగాయ పచ్చళ్ల వల్ల అవి కిడ్నీల పైన భారం
ఇక బిపి, డయాబెటిస్ ఉన్నవాళ్లు పచ్చడి ఎంత తక్కువ తింటే అంత మంచిదని సూచిస్తున్నారు. పచ్చళ్ళు నిల్వ ఉండడానికి వాటిలో ఉప్పు ఎక్కువగా వేస్తారు. పచ్చళ్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటం వల్ల అవి బిపి, డయాబెటిస్ లను బాగా పెంచుతాయి. ఊరగాయ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల అవి కిడ్నీల పైన భారం పడేలా చేస్తాయని కిడ్నీలను పాడుచేస్తాయని హెచ్చరిస్తున్నారు.
నిల్వ పచ్చళ్ళతో అనారోగ్యం
నిల్వ పచ్చళ్ళు రక్తపోటును పెంచి, గుండె సమస్యలకు కారణం అవుతాయని సూచిస్తున్నారు. ఇక పచ్చళ్లలో నిండుగా పోసే నూనె శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని, కనుక పచ్చళ్లను సాధ్యమైనంత తక్కువగా తింటేనే మంచిదని సూచిస్తున్నారు. పోషకాహార నిపుణులు, వైద్యులు సూచనల మేరకు నిలువ పచ్చళ్ళను తినడం తగ్గించి, శరీరానికి పోషకాలను ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఇక ఈ విషయాన్ని ముఖ్యంగా పచ్చళ్ళ ప్రియులు తెలుసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి వారిని వారు రక్షించుకున్న వారు అవుతారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications