చలి పెరుగుతోంది.. చర్మాన్ని పొడిబారకుండా రక్షించుకోండిలా!
నవంబర్ మాసం పూర్తయి డిసెంబర్ మాసం కూడా వస్తోంది. ఇక చలి ఇప్పటికే చంపేస్తుంది. ముందు ముందు డిసెంబర్, జనవరి నెలలలో విపరీతంగా చలి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే శీతాకాలం కారణంగా చర్మం పొడి బారటం ప్రధానంగా కనిపిస్తుంది. శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలను తీసుకోవాలి .మన వంటింటి చిట్కాలతోనే మన చర్మాన్ని కాపాడుకోవచ్చు. అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
చలికాలం చర్మ సంరక్షణా చిట్కాలు
శీతాకాలంలో చర్మం పొడిబారి బారకుండా ఉండేందుకు కొబ్బరి నూనెను ఉపయోగించడం మంచిది. కొబ్బరి నూనె పొడిబారిన చర్మానికి కావలసిన తేమను అందించి చర్మం సాఫ్ట్ గా ఉండేలా చేస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్ చర్మానికి మెరుపును ఇస్తుంది. ఇక శీతాకాలంలో చర్మ సౌందర్యం కోసం, చర్మం తేమగా మృదువుగా ఉండడం కోసం పాలను ఉపయోగిస్తే మంచిది. పాలలో దూది నానబెట్టి ముఖంపైన అద్దితే చర్మం తాజాగా కనిపిస్తుంది.

ఇంట్లో ఉండే వీటితో చర్మానికి నిగారింపు
ఇక శీతాకాలంలో చర్మం పొడిబారి పగిలిపోయి అసహ్యంగా కనిపించకుండా తేనెను అప్లై చేయడం కూడా ఎంతో మంచిది. పొడిబారిన చర్మంలో తేమదనాన్ని సంతరించుకునేలా తేనె బాగా పనిచేస్తుంది. తేనెను ఒక పల్చని పొరలా చర్మంపై అప్లై చేయడం వల్ల మన చర్మం సున్నితత్వాన్ని, నిగారింపును సొంతం చేసుకుంటుంది.
శీతాకాలంలో చర్మం తేమ కోసం ఇలా చెయ్యండి
ఇక శీతాకాలంలో చర్మాన్ని కాపాడుకునేందుకు కీరదోస చాలా బాగా పనిచేస్తుంది. కీరదోస చర్మాన్ని చల్లగా ఉంచడమే కాకుండా, చర్మం లో తేమని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చాలామంది శీతాకాలంలో చల్లగా ఉండడం వల్ల ఎక్కువగా నీరు తాగరు. దీనివల్ల శరీరం డి హైడ్రేడ్ అయ్యి చర్మం పొడి బారుతుంది. చర్మాన్ని తేమగా ఉంచడానికి ప్రతిరోజు తగినంత నీటిని తప్పనిసరిగా తాగాలి.
అలోవెరా జెల్, పెట్రోలియం జెల్లీలతో చర్మం నిగారింపు
ఇక శీతాకాలంలో పొడి చర్మం వల్ల కలిగే ఇబ్బందుల నుండి అలోవెరా జెల్ ఉపశమనాన్ని ఇస్తుంది. అలోవెరా జెల్ చర్మాన్ని సహజంగా తేమతో ఉంచి పొడిబారడం నుండి కాపాడుతుంది. శీతాకాలంలో పెట్రోలియం జెల్లీ కూడా చర్మం పొడిబారకుండా రక్షణ నిస్తుంది. ఇక శీతాకాలంలో చర్మం పొడిబారకుండా నిగారింపును సొంతం చేసుకోవాలంటే పైన పేర్కొన్న చిట్కాలను ట్రై చేసి చూడండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications