Artificial Blood: కృత్రిమ రక్తాన్ని తయారు చేసిన జపాన్-ఎన్ని ప్రయోజనాలో..?
ప్రపంచవ్యాప్తంగా నిత్యం కొన్ని కోట్ల మంది అత్యవసర పరిస్ధితుల్లో రక్తం కోసం ఎదురుచూస్తున్నారు. రక్తదాతలు దొరికితే చాలు ప్రాణం కాపాడుకోవచ్చని భావిస్తున్నారు. దీంతో అన్ని దేశాల్లోనూ రక్తదాతలకు కూడా ఎంతో డిమాండ్ ఉంది. అత్యవసర పరిస్ధితుల్లో ప్రాణాలు కాపాడేందుకు పనికొస్తున్న రక్తం కొరత మాత్రం చాలా ఉంటోంది. దీనికి ప్రత్యామ్నాయాన్ని ఇప్పుడు జపాన్ తయారు చేసింది.
జపాన్ శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధనలు చేసి కృత్రిమ రక్తాన్ని తయారు చేశారు. సాధారణ రక్తం తరహాలోనే ఆక్సిజన్ ను శరీర భాగాలకు ప్రసరింపచేసేలా దీన్ని రూపొందించారు. ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ నుంచే దీన్ని తయారు చేశారు. అలాగే చిన్న చిన్న బుడగల్లో దీన్ని నిల్వ చేస్తున్నారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఈ కృత్రిమ రక్తానికి గ్రూపులతో సంబంధం లేదు. దీంతో డాక్టర్లు అత్యవసర పరిస్ధితుల్లో ఈ కృత్రిమ రక్తాన్ని ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికైనా వాడుకోవచ్చు. అలాగే దీన్ని దాదాపు రెండేళ్ల పాటు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. అసలు రక్తాన్ని మాత్రం కొన్ని వారాల పాటు మాత్రమే నిల్వచేసుకోవచ్చు. ఆ తర్వాత పాడైపోతుంది. ఈ కృత్రిమ రక్తం వైరస్ రహితంగా ఉంటుంది. దీన్ని ఏ వైరస్ లూ సోకవు. కాబట్టి ఇన్ ఫెక్షన్లు వ్యాప్తించే ప్రమాదం లేదు.
మనిషి జుట్టు కంటే 4 వేల రెట్లు సన్నగా ఉండే క్యాప్సూల్స్ లో ఈ కృత్రిమ రక్తాన్ని నిల్వచేసుకోవచ్చు. ఈ క్యాప్సూల్స్ రక్తప్రవాహంలో తేలుతూ సహజ ఎర్ర రక్త కణాల మాదిరిగానే ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. జపాన్‌లోని ఆరోగ్యకరమైన వాలంటీర్లపై చేసిన చిన్న మోతాదు ట్రయల్స్ ఇది సురక్షితమని నిరూపించాయి. ఇప్పుడు మోతాదు పెంచి ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ జరిపిన ట్రయల్స్ లో తాత్కాలిక జ్వరం లేదా స్వల్ప రక్తపోటు వంటి చిన్న సమస్యలు మాత్రమే కనిపించాయి. ప్రస్తుత ట్రయల్స్ కూడా పూర్తయితే 2030 నాటికి ఈ కృత్రిమ రక్తం వాడకం ప్రారంభించనున్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications