ముద్దుతో అద్భుతం: అందం, ఆనందమే కాదు ఆరోగ్యం కూడా!!

ముద్దు.. జీవిత భాగస్వామి ప్రేమను వ్యక్తం చేయడానికి, ప్రేమికులు ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేయడానికి చుంబనమే మార్గం. అధర చుంబనాన్ని వారి ప్రేమకు సంకేతంగా చెప్పవచ్చు. అటువంటి ముద్దు తోటి ఆనందమే కాదు ఆరోగ్యం కూడా అని చెబుతున్నారు వైద్యులు. ముద్దుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ముద్దుతో ముఖంలోని కండరాలు అన్నింటికీ వ్యాయామం అవుతుంది. ముద్దు పెట్టడం వల్ల ముఖానికి మంచి ఆకృతి వస్తుంది. ముద్దు వల్ల ముఖంపై ముడతలు తొందరగా రావు. అంతేకాదు హై బి.పి ఉన్నవారికి ముద్దు పెడితే వారి బిపి కాస్త తగ్గుతుంది. ముద్దు రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గించటానికి ఉపయోగపడుతుంది.

Kiss

శరీరంలోని నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి ముద్దు మేలు చేస్తుంది.ముద్దు వల్ల తల నొప్పి, తిమ్మిర్లు, రుతుస్రావం ఈ సమయంలో నొప్పులు తగ్గుతాయి. ముద్దు పెడుతున్నప్పుడు మన శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్ వంటి రసాయనాలు విడుదలై మానసిక ఆందోళనను దూరం చేస్తాయి. మానసికంగా డిప్రెషన్లో ఉన్నవారికి కూడా ముద్దు మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు.

ముద్దు పెట్టుకున్నప్పుడు విడుదలయ్యే లాలాజలం మన పళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పళ్ళు పాడు కాకుండా చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ముద్దు కూడా వ్యాయామమే. ముద్దు పెట్టుకోవడం వల్ల ఒక్క చుంబనంతో శరీరంలో 8 నుండి 16 కేలరీల శక్తి వినియోగించబడుతుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల లైంగిక ఆసక్తి బాగా పెరిగి శృంగారంలో కూడా ఉత్తేజంగా పాల్గొంటారు. దీనివల్ల ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. మనకు ఎంతో మేలు చేసే ముద్దును కచ్చితంగా ముద్దు చేస్తేనే మంచిదని చెప్పొచ్చు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+