కరివేపాకు అని తీసి పారేయకండి.. ప్రయోజనాలు తెలిస్తే అసలే వదిలిపెట్టరు!
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యం కోసం మనం అనేక రకాల ఆకులను మన ఆహారంలో ఉపయోగిస్తూ ఉంటాం. అలా మన ఆహారంలో ఉపయోగించే ఆకులలో కరివేపాకు ఒకటి. కరివేపాకులో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల మన శరీరానికి ఎనలేని ప్రయోజనాలు కలుగుతాయి.
కరివేపాకులో బోలెడు పోషకాలు
చాలామంది కూరలో వేసిన కరివేపాకును తీసి పక్కన పెడుతూ ఉంటారు. కానీ కరివేపాకును తినటం చాలా మంచిది. అది మనకు చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కరివేపాకులో బోలెడు పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. కరివేపాకు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కరివేపాకుతో డయాబెటిస్ కు చెక్
కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యల నుంచి మన శరీరాన్ని కాపాడటానికి కరివేపాకు ఎంతగానో దోహదం చేస్తుంది. ఇక కరివేపాకు డయాబెటిస్ బాధితులకు ఎంతో బాగా పనిచేస్తుంది. కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మన ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
జుట్టు పెరుగుదల, చర్మ ఆరోగ్యం
జుట్టు రాలడాన్ని నివారించి, మన జుట్టు పెరుగుదలను కరివేపాకు ప్రోత్సహిస్తుంది. కరివేపాకును నిత్యం తినడం వల్ల మన చర్మం కాంతివంతమవుతుంది. చర్మ సంబంధిత సమస్యలను కరివేపాకు నివారిస్తుంది. కరివేపాకు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది. కరివేపాకు మన శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది.
అయితే ఇలా తీసుకుంటే డేంజర్
ఇక కరివేపాకును మనం పచ్చిగా అయినా తినవచ్చు. లేదా కూరలలో వేసుకుని, పచ్చడిగా చేసుకుని, పొడిగా చేసుకుని తినవచ్చు. కరివేపాకు పొడిని నీటిలో వేసుకుని మరిగించి తాగవచ్చు. అయితే కరివేపాకు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అతిగా సేవించడం మాత్రం అనర్థాలకు దారితీస్తుంది. కనుక కరివేపాకును అతిగా తీసుకోవడం మంచిది కాదు. కరివేపాకును మితంగా తీసుకుంటే అది మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.
disclaimer: ఈ కథనం ఆయుర్వేద వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications