Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నల్ల శనగల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలే వదిలిపెట్టరు!

మన శరీర ఆరోగ్యానికి దోహదం చేసే ఆహారాలలో నల్ల శనగలు ఒకటి . నానబెట్టిన నల్లశనగలు ఒక వంద గ్రాములు కనుక మీరు తిన్నట్లయితే శక్తి పెరిగి జీర్ణవ్యవస్థ మెరుగుపడి కండరాలు బలంగా మారుతాయి. ఆ రోజంతా మంచి ఎనర్జీతో ఉత్సాహంగా ఉంటారు . అంతేకాదు మీ శరీరానికి కావలసిన అన్ని రకాల ప్రోటీన్లు ఈ నల్ల శనగలలో పుష్కలంగా ఉండటం వలన అలసట రాదు.

నల్ల శనగలతో ఆరోగ్యం
అధిక బరువుతో, చెడు కొలెస్ట్రాల్ కలిగి ఇబ్బంది పడుతున్న వారికి సన్న బడటానికి, అధిక బరువుతో పాటు కొలెస్ట్రాల్ తగ్గడానికి నానబెట్టిన నల్ల శనగలు బాగా దోహదపడతాయి. మలబద్ధక నివారణకు మంచి ఉపయోగం ఉంటుంది. నల్ల శనగలలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రోజు ఒక అరకప్పు నానబెట్టిన నల్ల శనగలు ఒక వారం రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Know the health benefits of black chickpeas

గుండె ఆరోగ్యం, బ్లడ్ షుగర్ కు నల్ల శనగలు
నల్ల శనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మిటమిన్ బీ 6, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండి మెదడు మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటం కోసం నల్ల శనగలు ఉపయోగపడుతున్నాయి. బ్లడ షుగర్ ని నియంత్రించేందుకు నల్ల శనగలు అత్యద్భుతంగా పనిచేసే మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.. ముఖ్యంగా మల బద్దకంతో బాధపడేవారికి మంచి ఫలితాలు ఉంటాయి..

నల్ల శనగలతో ఈ లాభాలు కూడా
నల్ల శనగలతో గుండెకు రక్త ప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నరాల బలహీనత ఉన్న వారికి దివ్య ఔషధంగా ఇది ఉపయోగపడుతుంది. ఎన్నో మానసిక సమస్యలకు, నరాల బలహీనత, నరాల సమస్యలకు నల్ల శనగలు ఉపయుక్తం. నానబెట్టిన నల్ల శనగలు తింటే మంచి రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు.

శక్తికి నల్ల శనగలు
శనగలు కాల్షియం, ఫాస్ఫరస్ వంటి మంచి పోషకాలను కలిగి ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. శనగలు చర్మ ఆరోగ్యానికే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది. శనగలు శరీరానికి తగినంత శక్తిని ఇవ్వటానికి సహాయపడతాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+