అరటిపండ్లు అతిగా తింటే ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే మీకే నష్టం!
అరటిపండు.. చాలామంది అరటిపండును ఇష్టంగా తింటారు. అరటిపండు లో ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయని వాటిని ప్రతిరోజూ తినేవారు ఉన్నారు. అయితే అరటిపండ్లను అతిగా తింటే ఒక రోజులో మూడు నాలుగు అరటిపండ్లను తింటే అది అనర్ధాలకు కారణంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అరటిపండులో ఫుల్ పోషకాలు
అన్ని సీజన్లలోనూ దొరికే పండు అరటిపండు. సామాన్య వర్గానికి కూడా తక్కువ ధరకు లభించే ఈ పండును ప్రతి ఒక్కరు తినడానికి ఇష్టపడతారు. అరటి పండులో ఉండే విటమిన్ సి, విటమిన్ b6, పిండి పదార్థాలు, ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, పెప్టిన్, సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ మన శరీరానికి కావలసిన పోషకాలను ఇచ్చి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

అరటిపండ్లు అతిగా తింటే బరువు సమస్య
అయితే అటువంటి అరటి పండ్లు ఎంత మేలు చేస్తాయో అతిగా తింటే అంతే హాని కూడా చేస్తాయి. అరటి పండ్లు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు ఒకటి నుంచి రెండు పండ్ల కంటే ఎక్కువ అరటి పండ్లు తినకూడదని చెబుతున్నారు. అరటిపండు ఎక్కువగా తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ కంటెంట్ మన శరీరంలో కూడా పెరుగుతుందని, ఇది బరువు తగ్గడానికి బదులు పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.
అరటిపండ్లు అతిగా తింటే మలబద్దకంతో పాటు ఈ ఇబ్బందులు
అరటిపండ్ల లో అవసరమైన మొత్తంలో స్టార్చ్ ఉంటుంది. అయితే దీనిని అతిగా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఆ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. ఇక అరటి పండ్లు ఎక్కువగా తింటే మైగ్రేన్ సమస్య వస్తుంది. డయాబెటిస్ తో బాధపడేవారు అరటి పండ్లు ఎక్కువగా తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. కనుక మీరు అరటిపండు అతిగా తినకపోవడం మంచిది.
అరటిపండ్లు అతిగా తింటే ఈ సమస్య కూడా
అరటిపండ్లు ఎక్కువ తింటే అది మానసికంగా మన యాక్టివ్ నెస్ ను తగ్గిస్తుంది. మగతగా అనిపిస్తుంది. కనుక అరటి పండును సాధ్యమైనంత తక్కువగానే తినాలి. ఎక్కువగా తింటే పైన పేర్కొన్న ఇబ్బందులు మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. కనుక అరటిపండు తినే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications