పచ్చి కొబ్బరి తింటున్నారా? పోషకవిలువలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
చాలామంది కొబ్బరిని ఇష్టంగా తింటారు. కొబ్బరిని వంటకాలలో కూడా ఉపయోగిస్తారు. కొబ్బరిని పచ్చడిగానూ, కూరలలోనూ, స్వీట్లు తయారీలోనూ వివిధ విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే కొబ్బరిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? పచ్చి కొబ్బరి తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నేడు వరల్డ్ కోకోనట్ డే
ఈరోజు వరల్డ్ కోకోనట్ డే.. కొబ్బరికాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను, అది మన శరీరానికి అందించే న్యూట్రిషన్ ను తెలుసుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఈ క్రమంలో కొబ్బరి తినడం వల్ల కలిగే అత్యంత ముఖ్యమైన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

పచ్చి కొబ్బరితో గుండెకు ఆరోగ్యం
పచ్చి కొబ్బరి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన గుండె ఆరోగ్యానికి కావలసిన ఆరోగ్యకరమైన కొవ్వులు పచ్చికొబ్బరిలో పుష్కలంగా ఉంటాయి. మన కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో పచ్చికొబ్బరి ఎంతగానో సహాయపడుతుంది. ఇది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.పచ్చి కొబ్బరి తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.
పచ్చి కొబ్బరితో జీర్ణ వ్యవస్థ మెరుగ్గా
పచ్చి కొబ్బరిలో డైటరీ ఫైబర్ ఉంటుంది ఇది మన జీర్ణక్రియకు సహాయపడుతుంది అంతేకాదు మన పేగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పచ్చి కొబ్బరి మన శరీరంలో నీటి శాతం కోల్పోకుండా చేస్తుంది. పచ్చి కొబ్బరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి శరీర జీవ ప్రక్రియను మెరుగుపరుస్తాయి.
పచ్చి కొబ్బరిలో ఫుల్ పోషకాలు
పచ్చి కొబ్బరిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, థయామిన్, రైబో ఫ్లైవిన్, నియాసిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, ఐరన్ ఉంటాయి. తరచుగా కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయి. పచ్చికొబ్బరిని ఎక్కువగా తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. కొబ్బరిలో ఉండే పోషకాలు మన శరీరంలోని అవయవాలు చురుగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి.
కొబ్బరితో చర్మ ఆరోగ్యం
పచ్చి కొబ్బరి మన చర్మ ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది. మన చర్మం సాఫ్ట్ గా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా పచ్చి కొబ్బరి మంచి ఆహారం. కనుక కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవటం దానిలోని పోషకాలను శరీరానికి అందించటం అస్సలు మర్చిపోకండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications