Kurnool Uggani Bajji:ఇది వంట కాదు..ఒక ఎమోషన్..!!

Kurnool Uggani Bajji:ఆంధ్రా వంటకాల్లో ఎన్ని వెరైటీలు ఉన్నా, రాయలసీమ పేరు వినగానే నరం నరంలోనూ ఒక రకమైన 'ఘాటు' పుడుతుంది. అక్కడ తిండి అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు, అదొక వీరత్వం.బయట వాతావరణం చల్లగా ఉన్నా, మనసు ఏదో ఒక 'కిక్కు' కోసం వెతుకుతున్నా.. మీకు గుర్తుకు రావాల్సింది కర్నూలు ఉగ్గానీ.బొరుగులతో (మరమరాలు) చేసే ఈ అద్భుతం, మిరపకాయ బజ్జీతో జతకడితే.. అది 'రామ్-లక్ష్మణ్'ల బంధం కంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది. మరి ఆ సీమ రుచిని మీ వంటింట్లోకి ఎలా తెచ్చుకోవాలో తెలుసుకుందామా..

ఉగ్గానీ బజ్జీ తయారీకి కావాల్సిన సైన్యం:

  • బొరుగులు (మరమరాలు): ఒక పెద్ద గిన్నెడు (ముఖ్యంగా గట్టిగా ఉండే 'కర్నూలు బొరుగులు' అయితే రచ్చ రచ్చే.
  • పుట్నాల పొడి: అర కప్పు (ఇదే ఉగ్గానీకి అసలైన మేకప్)
  • పచ్చిమిర్చి: 6-8 (మీ కారానికి తగినట్టు)
  • ఉల్లిపాయలు, టమాటాలు: సన్నగా తరిగినవి.
  • తాలింపు సామాగ్రి: ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, వేరుశనగ పప్పులు.
  • బజ్జీల కోసం: లావుపాటి మిరపకాయలు, శనగపిండి, వాము, ఉప్పు.
kurnool-uggani-bajji-recipe-rayalaseema-s-fiery-and-spicy-breakfast-that-you-must-definitely-try

ఎలా తయారు చేయాలో రంగంలోకి దిగుదాం..

బొరుగుల స్నానం
ముందుగా ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకుని, బొరుగులను అందులో పడేయండి. అవి కాస్త 'మునిగి తేలాక' (కేవలం 2 నిమిషాలు మాత్రమే), గట్టిగా పిండేసి మరో గిన్నెలోకి మార్చండి. గుర్తుంచుకోండి.. ఎక్కువసేపు నీళ్లలో ఉంచితే అది కాస్త పాయసంగా మారిపోతుంది.

అసలైన 'ఉగ్గానీ' మసాలా
మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, అల్లం ముక్క వేసి కచ్చాపచ్చాగా దంచండి. మరోవైపు పుట్నాల పప్పును మెత్తగా పొడి చేసి సిద్ధం చేసుకోండి.

పోపు పెట్టేద్దాం.. ఘుమఘుమలేద్దాం..

బాండీలో నూనె వేసి, అది వేడెక్కాక వేరుశనగ పప్పులు, తాలింపు గింజలు వేసి చిటపటలాడించండి. అందులోకి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేయించి.. ఆపై టమాటాలను పంపి 'మగ్గిపోండి' అని ఆర్డర్ వేయండి. టమాటాలు మెత్తబడ్డాక, ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించండి.

క్లైమాక్స్: ఉగ్గానీ రెడీ..

ఇప్పుడు పిండి పెట్టుకున్న బొరుగులను బాండీలో వేసి, పసుపు, తగినంత ఉప్పు, ఆ పుట్నాల పొడి చల్లి.. ఒక్కసారి 'మాస్' రేంజ్‌లో కలిపేయండి. చివరగా కొంచెం నిమ్మరసం, కొత్తిమీర చల్లితే.. ఉగ్గానీ 'స్టేజ్' మీద డ్యాన్స్ చేయడానికి రెడీ.

సైడ్ హీరో ఎంట్రీ: మిరపకాయ బజ్జీ..

ఉగ్గానీకి బజ్జీ లేకపోతే.. హీరో లేని సినిమా లాగే ఉంటుంది. శనగపిండిలో వాము, ఉప్పు, కొంచెం వంటసోడా వేసి చిక్కగా కలుపుకోండి. మిరపకాయల పొట్ట చీల్చి, లోపల కొంచెం చింతపండు రసం లేదా వాము పొడి పెట్టి.. పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వదలండి. అవి గోల్డెన్ కలర్‌లో మెరిసిపోతున్నప్పుడు ప్లేట్లోకి తీసుకోండి.

ఒక ప్లేటులో వేడివేడి ఉగ్గానీ.. పక్కన రెండు కరకరలాడే మిరపకాయ బజ్జీలు.. పైన కాస్త ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం చల్లుకుని తింటుంటే.. అబ్బబ్బా.. అప్పుడు అర్థమవుతుంది రాయలసీమ రుచి అంటే ఏంటో. ఈ కాంబినేషన్ తిన్నాక "జై రాయలసీమ!" అని అరవకపోతే అడగండి.ఇంకెందుకు ఆలస్యం? వంటింట్లోకి వెళ్లి ఆ 'ఘాటు' ఏంటో చూసేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+