బండి స్టైల్ "ముంత మసాలా".. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి !!

సాధారణంగా ఎవరికైనా చిరుతిండి తినాలని ఉంటుంది. అయితే ఎక్కువగా చిన్నపిల్లలే ఎక్కువగా వాటిని తింటూ ఉంటారు. ఇక సాయంత్రం సమయంలో అయితే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ వేడి వేడి పునుగులు, బజ్జీలు.. ముంత మసాలా, బేల్ పూరి, గప్‌చుప్‌లాంటి స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. వీటిలో ముఖ్యంగా ముంత మసాలా (Munta Masala) అయితే ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు. కరకరలాడే రుచి, మసాలా టేస్ట్‌, నిమ్మరసం పులుపు కలిపి తింటుంటే ఆ టేస్టే వేరు.

ఇక బయట బండి వద్ద చేసే ముంత మసాలాకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇంట్లోనే రెండు నిమిషాల్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో టేస్టీ టేస్టీ ముంత మసాలా ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకోసం ప్రత్యేకంగా..

street-food-style-muntha-masala-making-recipe-in-telugu

ముంత మసాలా తయారీకి కావలసిన పదార్థాలు..

  • మరమరాలు - 2 కప్పులు
  • కార్న్ ఫ్లేక్స్ - అర కప్పు (కిరాణా షాపుల్లో దొరికే స్నాక్ వేరియంట్‌)
  • పల్లీలు - పావు కప్పు
  • ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
  • టమాటా - 1 (సన్నగా తరిగినది)
  • పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
  • కొత్తిమీర - కొద్దిగా (తరిగినది)
  • నూనె - తగినంత (వేయించడానికి)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - తగినంత
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
  • చాట్ మసాలా - 1 టీస్పూన్
  • నెయ్యి - 2 టీస్పూన్లు
  • నిమ్మకాయ - 1

తయారీ విధానం..

ముందు ప్రిపరేషన్‌..

ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. వీటివల్ల టేస్ట్‌, రంగు రెండూ బాగా వస్తాయి.

మరమరాలు వేయించడం..

కడాయిలో మరమరాలు వేసి మీడియం మంటపై రెండు నిమిషాలు డ్రై రోస్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల అవి కరకరలాడుతూ, పుల్లగా కాకుండా ఉంటాయి. వాటిని ఒక బౌల్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

కార్న్ ఫ్లేక్స్ వేయించడం:

అదే కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కార్న్ ఫ్లేక్స్ వేసి వడియాల మాదిరిగా కరకరలాడేవరకు వేయించాలి. వేయించిన వాటిని టిష్యూ పేపర్‌పైకి తీసి, అదనపు నూనె తొలగించాలి.

పల్లీలు వేయించడం:

అదే నూనెలో పల్లీలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇవి ముంత మసాలాకు కరకరలాడే టెక్స్చర్ ఇస్తాయి.

మిశ్రమం తయారీ..

ఒక పెద్ద బౌల్‌లో వేయించిన మరమరాలు, కార్న్ ఫ్లేక్స్ వేసి కలపాలి. అందులో తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలపండి.

తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి చేత్తో లేదా స్పూన్‌తో బాగా కలపాలి.

చివరగా నెయ్యి, నిమ్మరసం, వేయించిన పల్లీలు వేసి మళ్లీ కలపండి.

రుచి చూసి అవసరమైతే ఉప్పు, కారం, పులుపు వేసుకోండి.

టిప్స్ ..

మరమరాలు తాజాగా రోస్ట్ చేసినవి అయితేనే రుచి కరకరలాడుతుంది.

టమాటా ఎక్కువ వేస్తే మరమరాలు మృదువవుతాయి, కాబట్టి మోతాదు కాపాడాలి.

తక్కువ కారం ఇష్టమైతే, చాట్ మసాలా లేదా పుదీనా చట్నీ చుక్క వేసినా చాలు.

మరింత రుచికోసం బోయించిన బంగాళాదుంప ముక్కలు లేదా స్ప్రౌట్స్ కూడా కలపొచ్చు.

చిన్న పిల్లలకు ఇస్తే పచ్చిమిర్చి తగ్గించండి.

మరమరాల కరకరలాడే తీరూ, చాట్ మసాలా స్పైసీ రుచీ, నిమ్మరసం పులుపు కలయికతో ఉండే బండీ స్టైల్ ముంత మసాలాని మీరు ట్రై చేయండి. ఐదు నిమిషాల లోపే తయారు చేసుకోగలిగే ఈ టేస్టీ స్నాక్ మీరు కూడా ఎంజాయ్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+