తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటున్నారా?
మనలో రోగనిరోధకశక్తి బలోపేతమవడానికి తేనె ఉపయోగపడుతుంది. విశృంఖల కణాలను, హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు ఎక్కువగా ఉంటాయి. తేనెను శుద్ధి చేసినప్పుడు, వెలుగు తగిలినప్పుడు దీనిలో ఉండే పుప్పొడి దెబ్బతింటుంది. ఎక్కువ పోషకాలు ఆ పుప్పొడిలోనే ఉంటాయి. ముడి తేనె అయితే మంచిది.
* ఒక స్పూన్ తేనె, స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.

* మన పెదవులు సహజ రంగులో ఆరోగ్యంగా ఉండాలంటే మృతకణాలను తొలగించాలి. ఒక స్పూను తేనెలో పంచదారను కలిపి పెదవులపై సున్నితంగా మర్దనా చేస్తే మంచి ఫలితముంటుంది.
* ఒక కప్పు హెర్బల్‌టీకి ఒక స్పూను తేనె కలిపి తాగాలి. ఇలా తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి డిటాక్సిఫికేషన్ జరుగుతుంది.
* స్పూన్ తేనెకు, అరస్పూన్ దాల్చినచెక్క పొడి కలుపుకొని తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు. అంతేకాదు.. ఇది పంటిసమస్యల నుంచీ ఉపశమనం కలిగిస్తుంది.
* రెండు స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్‌కి ఒక స్పూన్ తేనె కలిపి సేవిస్తే సైనస్ అదుపులో ఉంటుంది.
* తేనె, రోజ్ వాటర్ వంటి వాటిలోని వ్యాధినిరోధక గుణాలు ఉంటాయి. ఇవి మచ్చలను దూరం చేస్తాయి. రోజ్ వాటర్ చర్మంలోని పీహెచ్ స్థాయులను సమన్వయం చేసి, ఎప్పటికప్పుడు తాజాగా ఉంచుతుంది.
* సోడియం, ఫాస్ఫరస్, క్యాల్షియం, ఐరన్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ బి, విటమిన్ సి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి.
* ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
* ఒక స్పూన్ తేనె, సగం చెక్క నిమ్మరసం కలిపి ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో పరగడుపునే తాగాలి. దీనివల్ల మలబద్ధకం, ఛాతీ మంట తగ్గుతాయి.

* బరువు తగ్గాలనుకునేవారు, ఉపవాసం చేసేవారు తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
* మద్యం తాగిన తర్వాతరోజు చాలామందికి తలనొప్పి వస్తుంది. ఈ రకం తలనొప్పులను తేనె తగ్గిస్తుంది. ఇందులోని ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర కాలేయం మద్యాన్ని త్వరగా విడగొట్టేలా చేసి హాయిగా ఉండే భావనను కల్పిస్తుంది.
* అల్సర్లు, అసిడిటీతో బాధపడేవారు ఖాళీ కడుపుతో తేనె, నిమ్మరసం తీసుకోకూడదు. అలా తీసుకుంటే కడుపులో మంట రావచ్చు. ఇలా మంటగా అనిపించినా లేక కడుపులో నొప్పి వచ్చినా తేనె, నిమ్మరసం పానీయం సరిపడదని అర్థం.
* మధుమేహ రోగులకు తేనె మంచిది కాదు. దీనివల్ల షెగర్ లెవల్ పెరుగుతుంది.












Click it and Unblock the Notifications